తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today : ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..? - telugu panchangam

Horoscope Today : ఈ రోజు (మే 2) మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

horoscope-today-telugu-may-2-tuesday-horoscope-in-telugu-horoscope-daily
ఈ రోజు మీ రాశి ఫలాలు

By

Published : May 2, 2023, 6:13 AM IST

Horoscope Today : ఈ రోజు (మే 2) మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

సకల జీవరాశి పైనా అంతు లేని మమకారం ఉంటుంది. పేద వారిపై దయ చూపించడం ఒక మూర్ఖత్వ లక్షణంగా.. మిమ్మల్ని జమ కట్టేవాళ్ళు కూడా ఉంటారు. కొన్ని రకాల గడ్డు పరిస్థితులు తొలగిపోతాయి. మనశ్శాంతి ఉంటుంది. మీకది అవసరం. ఈ మానసిక స్థితి నించి కూడా లాభ పడతారు.

కమ్యూనికేషన్, పబ్లిక్ స్పీకింగ్ రంగాల్లో గానీ మీరు ఉండి ఉంటే.. ఈ రోజు ఆడియన్స్​ని మంత్ర ముగ్ధుల్ని చెస్తారు. ఒక్కొక్కరితో విడిగా మాట్లాడినప్పుడు కూడా మీ శ్రోతల్ని ఆకట్టుకుంటారు. ఇలా చెయ్యడం వల్ల మీ పరిచయస్థుల్లో కొందరితో మీకు సుదీర్ఘ సంబంధ బాంధవ్యాలు ఏర్పడవచ్చు. మీరు స్టూడెంట్ అయితే, అన్ని విషయాలూ అతి సులువుగా అందుకుంటారు. మీకు ఎక్కడ లేని అసాధారణమైన తెలివితేటలూ ఉంటాయి. ఆరోగ్యం అంత బాగుండకపోవచ్చు. మీరు కష్టపడిన దానికి తగినట్టుగా ఫలితం రాకపోవచ్చు. అయినా ఇవి మీపై ప్రభావం చూపకపోవచ్చు.

మీ ఎమోషన్స్​ని అదుపులో ఉంచుకోండి. వాటి అధీనంలోకి మీరు వెళ్ళకండి. ముఖ్యంగా ఆడవారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు గానీ మిమ్మల్ని ఎమోషనల్​గా పడెయ్యాలనుకుంటే.. మీరు లొంగి పోవడం తప్ప మరొకటి చెయ్యలేరు. ఆడవారి కంటే ప్రమాదం నీటితో కూడిన జలాశయాలు. వాటికి దూరంగా ఉండండి. దీర్ఘ కాలంలో వ్యాధులు తెచ్చిపెట్టే మద్యపానం వంటి అలవాట్లను మానుకోవాలి. మిమ్మల్ని కొన్ని ఆలోచనలు బాధిస్తాయి. మీకు నిద్ర చాలక ఆరోగ్యానికి కూడా దెబ్బ తీస్తుంది. కుటుంబ సభ్యులతో గొడవ పడకండి. ప్రయాణం చేయవద్దు.

ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు. కొత్త ప్రాజెక్టులూ, స్నేహితులనూ, ప్రియమైన వారిని కలుసుకోవడం వంటి కారణాల వల్ల మీ ఆనందం రెట్టింపు అవుతుంది. మీ ఉత్సాహం, శక్తీ అంత పై స్థాయిలో ఉంటాయి. మీ పోటీదారులు మీతో గెలవలేక ఓటమిని మౌనంగా స్వీకరిస్తారు. మీరు ఇష్టపడేవారి మనసుని మీరు గెల్చుకుంటారు. మీరు ఒక చిన్న ట్రిప్​నకు వెళ్ళి రావడం మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. మీ సోషల్ స్టేటస్ పెరుగుతుంది.

ఈ రోజు మీకు సాధారణంగా గడుస్తుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. మీకు ఏవైనా సమస్యలు వస్తే వారు మీ వెనకాల నిలబడతారు. ఆర్థిక సంబంధమైన విషయాలకు అంత మంచి రోజు కాదు. కానీ మీరు పోగొట్టుకున్న దాని కన్నా ఎక్కువ సంపాదించడానికి తగిన శక్తీ, బలం మీ కొత్త వ్యాపారంలో సంపాదించుకుంటారు. మీరు మీ పనిలో శ్రద్ధ పెట్టాలి.

ఈ రోజు చాలా మౌనంగా, ఏ గొడవా లేకుండా గడుస్తుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, మీరు సరదాగా, సంతోషంగా గడుపుతారు. మీ మనసుకి దగ్గరైన వారితో మీ మనసు విప్పి మాట్లాడతారు. రుచికరమైన భోజనం. ఉల్లాసం. ఆరోగ్యం గురించి మాత్రం ఎప్పడూ ప్రముఖంగా పట్టించుకోవాలి. అప్పడే మీరు చాలా అరుదైన, సంపూర్ణమైన మానసిక శాంతి పొందుతారు. ఈ రోజు మిమ్మల్ని లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుంది. మీకు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ఎక్కడికైనా ప్రయాణం పెట్టుకున్నా చాలా సంతోషిస్తారు. మిగతా వారిని కూడా మీతో కలుపుకుని మీరు ఈ అదృష్టకరమైన ఘడియల్ని ఆనందించండి.

ఈ రోజు మీకు అంత మంచి రోజు కాదు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాం. మీ ఆరోగ్యం సున్నితంగా ఉంటుంది. ఆలోచించి మాట్లాడండి. మీ ఆవేశం కంట్రోల్ చేసుకోండి. మీరు వచ్చే అన్ని సమస్యలనూ జాగ్రత్తగా ఆలోచించి పరిష్కరించుకోవాలి.

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ఫ్రెండ్స్​ని కలుసుకుంటారు. వారి మీద చాలా ఖర్చు చేస్తారు. తొందరలోనే మీ జీతంలో పెరుగుదల ఉంటుంది. నిజానికి ఇది మంచి రోజు. మీ సీనియర్స్ మీ పని నైపుణ్యాన్ని గుర్తించగలరు. మీ జీవిత భాగస్వామి కూడా అంతే ఆనంద పడగలరు.

ఈ రోజు అనేక ఆహ్లదకరమైన పనులు ఉంటాయి. వివాహితుల వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. తారాబలం అనుకూలంగా ఉంది. గృహజీవితం సరదాగా సాగుతుంది. అన్ని రంగాల్లో మీరు విజయం సాధిస్తారు. అది మీ పనిని, మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది.

ఈ రోజు సాధారణంగా గడుస్తుంది. తెలివి ఉపయోగించి ఇంటలెక్చువల్​గా సాగించే అన్ని పరిశీలనలకీ, అటువంటి కార్యకలాపాల్లో ఉన్న వారికి మరింత లాభసాటిగా ఉంటుంది. తారా బలం రచనా కార్యక్రమాలకీ, సృజనాత్మక, సాహితీపరమైన అన్వేషణలకూ కలిసి వస్తుంది. మీరు క్రియేటివ్ రైటింగ్ వర్క్ షాప్ గానీ , ఉత్సాహపరిచే సింపోజియమ్ గానీ కండక్ట్ చెయ్యండి.. విజయవంతం అవుతుంది. పబ్లిక్ సెక్టర్​కి సంబంధించి వచ్చే పనుల్లో బ్యూరోక్రసీ ఎక్కువ ఉంటుంది.. జాగ్రత్త! మీరు అలసిపోయి ఉంటే కాస్త విశ్రాంతి తీసుకోండి. మీరు కాసేపు ఊరుకుంటే.. ఈ స్థితి కూడా దాటి పోతుంది.

ఈ రోజు చాల ఇబ్బందులు, ఒత్తిడి వుండే అవకాశం వుంది. అందువల్ల కోపం, చిరాకు పెరుగుతాయి. ఈ సందర్బాలను తప్పించుకోవాలంటే దేవుణ్ణి స్మరించుకోవడం, మౌనంగా వుండడం, ధ్యానం చేయడం మంచిది. అందువల్ల మీకు ప్రశాంతంగా గడిపే అవకాశం వుంది. చట్ట విరుద్దమైన పనులు చేయవద్దు. మీ పద్దతి ద్వారా ఇతరులు భాధపడే అవకాశం వుంది. అందువల్ల వీలైనంతవరకూ మంచి మాటలే మాట్లాడండి. మీ ఇంట్లో ఒక శుభకార్యం జరగవచ్చు. అందువల్ల ఖర్చులు పెరగవచ్చు.

రోజువారీ పనులు పక్కనపెట్టండి. కుదిరితే కొంత సమయాన్ని సరదాగా గడపండి. ఆహారం, సరదా విషయాలకు ఈ రోజు అనుకూలంగా ఉంది. కాబట్టి ఆ దిశగా ఉండండి, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా, సంతోషంగా గడపండి.

ABOUT THE AUTHOR

...view details