తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today : ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందంటే? - Todays Horoscope 31st July 2023 In Telugu

Todays Horoscope 31st July 2023 In Telugu : ఈ రోజు (జులై 31) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Todays Horoscope 31st July 2023 In Telugu
ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందంటే?

By

Published : Jul 31, 2023, 6:13 AM IST

Horoscope Today : ఈ రోజు (జులై 31) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మీరు హాజరుకాబోయే ఓ ముఖ్యమైన కార్యక్రమం మీరు అనుకున్నంత ఫలితాలను ఇవ్వదు. దీంతో మీరు బాధపడతారు. ఈ రోజు ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. ఈ రోజు మీరు కొంత విసుగు చెందుతారు. పని ప్రదేశాల్లో లేదా ఇంట్లో మనస్పర్థలు రావచ్చు. మీ పెంకితనాన్ని అదుపులో పెట్టుకొనట్లయితే మీరు చేసే పనులకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అది మీరు చేయబోయే పనులపై ప్రభావం చూపవచ్చు.

ఈ రోజు ధ్యానం చేయండి మంచిది. ఈ రోజు అంత అనుకూలంగా ఉండదు. మీరు చేసే పని నుంచి ఈ రోజు కొంత విశ్రాంతి కోరుకుంటారు. కానీ, మీ సహోద్యోగులు, ఉన్నతాధికారుల నుంచి పనిఒత్తిడి తప్పదు. మీరు ఆశించిన ఫలితాలను కాస్త ఆలస్యంగా పొందుతారు. ప్రయాణాలు అనుకూలంగా లేవు. మౌనంగా ఉంటూ జాగ్రత్తగా మీ పనులు మీరు చేసుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. నూతన పనులు ప్రారంభించక పోవడం మంచిది.

ఈ రోజు సంతోషంగా, ఉత్సాహంగా గడుపుతారు. మీ వినయ వినమ్రతలు మీ స్నేహితులు, బంధువులు, సహోద్యోగుల్లో మీ పేరు ప్రతిష్ఠలను పెంచుతాయి. మీరు చూడాలనుకున్న ప్రదేశాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సందర్శిస్తారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. మీ అభిరుచికి తగ్గట్టు షాపింగ్​ చేస్తారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. మీకు నచ్చిన ఆహారాన్ని తింటారు.

వ్యాపారపరంగా ఈ రోజు చాలా అదృష్టమైన రోజు. స్నేహితులు, సహోద్యోగులు నుంచి సహకారం అందుతుంది. మీ పని పట్ల పై అధికారులు సంతృప్తి చెందుతారు. మీరు ప్రేమించే వ్యక్తితో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి.

చిన్న చిన్న గొడవలతో ఈ రోజంతా కోపంగా గడుపుతారు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా మీ ముఖ్యమైన పనుల మీద దృష్టి సారించవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇష్టపడతారు. కొత్తగా ఆలోచిస్తారు. దీంతో మీ ఆలోచన విధానం కూడా మారుతుంది. విధ్యార్ధులకు ఇది అనువైన సమయం. వారు ఎంచుకున్న కోర్సులలో ముందంజలో వుంటారు. బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.

ఈ రోజు అంత మంచిరోజు కాదు. సోమరితనం, బద్ధకం, సరిగ్గా ఆలోచించక పోవడం మిమ్మల్ని అలసిపోయేలా చేస్తాయి. అందువల్ల మీరు మీ పనులను సరైన సమయానికి పూర్తి చేయలేరు. మీరు మందకొడిగా ఉంటారు. అందువల్ల ఇతర విషయాల్లోనూ శ్రద్ధ పెట్టలేరు. అనవసరమైన అనుమానాలతో మీరు ప్రేమించే వ్యక్తితో, మీ భార్యతో గొడవ పడే అవకాశం ఉంది. మీ తల్లి గారి ఆరోగ్యం విషయంలో ఒత్తిడికి గురి కావచ్చు. ఆస్తి లేదా కోర్టుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.

ఈ రోజు సందర్శనా ప్రదేశాలను చూస్తారు. దీంతో ఈ రోజంతా ఆనందంగా, ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబ వ్యవహారాలు అన్నీ బాగుంటాయి. దైవబలంతో మీరు మీ శత్రువుల మీద విజయాలను సాధిస్తారు. ఒక వ్యక్తి చెప్పే మాటలు మీ హృదయాన్ని కదిలిస్తాయి.

ఈరోజు మీకు సాధారణంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులను నియంత్రణలో పెట్టుకోవాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆహ్లాదకరంగా, మర్యాదగా ఉండటానికి ప్రయత్నించండి.అది గృహ శాంతిని, సామరస్యాన్ని నిర్ధరిస్తుంది. అనవసరమైన నిరాశకు లోనుకాకండి. దైవ కార్యక్రమాల కోసం ఖర్చులు చేస్తారు.

ఈ రోజు ఒక తీర్థయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రణాళికబద్ధంగా మీ పనులను పూర్తిచేస్తారు. ఉల్లాసంగా ఉంటూ సంతోషకరమైన అనుభూతిని చెందుతారు. మానసిక, శారీరక ఆరోగ్యం బాగుంటుంది. కుటంబంలో శుభప్రదమైన సందర్భాలు జరిగే అవకాశం ఉంది. మీ ప్రియమైన వ్యక్తిని కలుసుకుంటారు. అది రోజంతా మిమ్మల్ని ఆనందంగా గడిపేలా చేస్తుంది.

ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేయండి. పని ప్రదేశంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది. ఆదాయం తక్కువ ఉన్నప్పటికీ.. ధార్మిక, సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు, ఖర్చులు అధికంగా చేస్తారు. ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతారు. బంధువులతో, సంతానంతో మనస్పర్థలు ఏర్పడతాయి. జాగ్రత్తగా ఉంటే మంచిది.

కొత్త పనులను స్వీకరించడానికి ఈ రోజు శుభప్రదమైన రోజు. మీరు వృత్తిపరంగా లబ్ధి పొందుతారు. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు. ఈ రోజు అనుకూలంగా ఉంది. మీ పిల్లలతో సరదాగా గడుపుతారు. పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నవారు త్వరలోనే శుభవార్త వింటారు. భార్యాపిల్లల నుంచి మంచి వార్త వింటారు. వారితో కలిసి జాలీగా ఎక్కడికైనా వెళ్లొచ్చు.

వ్యాపారస్థులకు ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. మీ ప్రయత్నాలు విజయానికి దారితీస్తాయి. మీ యజమాని కూడా మీ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తారు. పదోన్నతికి కూడా అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్నవారు లాభాలు పొందుతారు. ఆ రంగంలో రాణిస్తారు. మీరు మీ తండ్రి నుంచి లబ్ధి పొందుతారు. మీ కుటుంబంలోని వాతావరణం సంతోషంగా ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details