తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today : ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందంటే? - Todays Horoscope 29th July 2023 In Telugu

Todays Horoscope 29th July 2023 In Telugu : ఈ రోజు (జులై 29) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

ఈ రోజు మీ రాశిఫలం 2023 జులై 29
Todays Horoscope 29th July 2023 In Telugu

By

Published : Jul 29, 2023, 6:05 AM IST

Horoscope Today : ఈ రోజు (జులై 29) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

ఆధ్యాత్మికంగా ఈ రోజు మీరు కొంత వింత అనుభూతికి లోనవుతారు. కొన్ని విషయాల పట్ల చెప్పలేని ఆసక్తిని కనబరుస్తారు. అధ్యాత్మికత పరంగా వృద్ధి చెందుతారు. కానీ అందరి కంటే ఎక్కువగా పేరుప్రతిష్ఠలు సాధించాలని మాత్రం ఆశించకండి. ప్రయాణాలకు దూరంగా ఉండడం మేలు.

ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. మీరు శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. సమాజంలో విజయవంతమైన వ్యక్తి మీరు. విదేశాల నుంచి శుభవార్త వింటారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అనుకోకుండా సిరిసంపదలు సిద్ధిస్తాయి.

ఈ రోజు మీరు పారంభించే పనుల్లో విజయం సాధిస్తారు. దీంతో మీకు మంచి పేరు వస్తుంది. ధనలాభంతో పాటు ఖర్చులు కూడా ఉన్నాయి. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. మీరు చేసే పనిలో ఇతరుల సాయం పొందుతారు. శ్రమకు తగ్గ ఫలితం దొరుకుతుంది.

ఈ రోజు మీరు చాలా చురుగ్గా ఉంటారు. దీంతో మీలోని ప్రతికూల ఆలోచనలు, నమ్మకాలు తొలగిపోతాయి. మీ పనికి సంబంధించిన బాధ్యతలను తీసుకుంటారు. అపజయాల గురించి ఆలోచిస్తూ సమయం వృథా చేయకుండా చేసే పనుల్లో లీనమవ్వండి.

ఈ రోజు సాధారణమైన రోజు. కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలకు దిగుతారు. శారీరిక, మానసిక ఆరోగ్యాలు సహకరించవు. అయోమయం, నెగిటివ్ ఆలోచనల్లోనే ఉంటారు. మీ తల్లి ఆరోగ్యం క్షీణించొచ్చు. చాలా ఒత్తిళ్లను ఎదుర్కొంటారు. ఇది మా నిద్రపై ప్రభావం చూపుతుంది. జలాశయాలకు, స్త్రీలకు దూరంగా ఉండండి. ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆహారం విషయంలో ఇబ్బంది పడతారు.

శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇవి మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చేస్తాయి. ఎక్కువశాతం సమయం మీరు చేసే పనిలోనే గడుపుతారు. మీకు నచ్చినవారితో సరదాగా గడుపుతారు. దీంతో వారి ద్వారా మీకు సహకారం కూడా అందుతుంది. మీ ఆధ్యాత్మ సంబంధమైన ఙ్ఞానానికి తగిన గుర్తింపు దొరుకుతుంది.

ముఖ్యమైన పనులను ఈ రోజు వాయిదా వేసుకోండి. మీలోని మొండితనం మీతో పాటు మీ చుట్టుపక్క వాళ్లని కూడా ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. కొద్దిగా అవగాహనతో మెలిగితే అందరికీ మంచిది. ఆర్థికపరంగా ఈ రోజు బాగుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.

ఈ రోజు సాధారణంగా గుడుస్తుంది. చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. స్నేహితులు, ఫ్యామిలీ నుంచి సహకారం ఉంటుంది. ఈ సంతోషంలో మీకు నచ్చిన వారిని కలుసుకుంటారు. శుభవార్త వింటారు. ఆనందం కలిగించే ప్రయాణాలు చేస్తారు. లైంగిక జీవితం ఆనందాన్నిస్తుంది.

ఆలోచించకుండా మాట్లాడే మాటలు మీకు మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది. మీ మాటతీరును మార్చుకునే ప్రయత్నం చేయండి. లేదంటే ఈ రోజంతా వాదనలు, సంజాయిషీలతో గడపాల్సి వస్తుంది. మానసికంగా ఇబ్బంది పడతారు.

ఈ రోజు చాలా అద్భుతంగా ఉంటుంది. సన్నిహితులు, బంధువులు, ఇష్టమైనవారిని కలుసుకుంటారు. వివాహం చేసుకొని జీవితంలో స్థిరపడాలనే ఆలోచించే వారికి ఈ రోజు మంచి రోజు. స్నేహితుల నుంచి ఆశ్చర్యకరమైన బహుమతిని అందుకుంటారు.

శారీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అన్ని పనులు మీకు అనుకూలంగా జరుగుతాయి. వృత్తిపరంగా చక్కగా రాణిస్తారు. మీరు చేసిన పని పట్ల ప్రశంసలు దక్కుతాయి. ఇది మీలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. మీ సహ ఉద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. దీంతో మీ విలువ మరింతగా పెరుగుతుంది.

మీ ఉన్నతాధికారులతో వాగ్వాదానికి దిగకండి. మానసికంగా, శారీరకంగానూ మందకొడితనంతో ఉంటారు. మనస్సులో నెగిటివ్​, అవసరం లేని విషయాల గురించి ఆలోచిస్తారు. మీ విరోధులు, పోటీదారులతో గొడవలు జరిగే సూచనలున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

ABOUT THE AUTHOR

...view details