Horoscope Today : ఈ రోజు (జులై 25) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
ఈ రోజు ఆనందంగా, సంతోషంగా గడుపుతారు. అన్నీ రంగాలవారికి విజయం సిద్ధిస్తుంది. అన్ని రంగాల్లోనూ శాంతి సౌఖ్యాల గురించి మాట్లాడుకునే ముందు మీ ఇంట్లో నెలకొనబోయే ప్రేమపూరిత వాతావరణం గురించి మాట్లాడుకోవాలి. ఈ అద్భుతమైన వాతావరణాన్ని ఉపయోగించుకుని మీరు మీ స్నేహితులతో, కుటుంబంతో విహార యాత్రకు వెళ్లిరండి. సామాజికంగా కూడా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగ విషయాల్లోనూ మీరు దూసుకుపోతారు. ధనలాభం ఉంటుంది.
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు కష్ట కాలం. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. అనారోగ్య సమస్యలు తలెత్తేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆందోళనకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. మీ ఇష్టదైవాన్ని దర్శించండి.
జీవితంలో విజయాలు అంత సులభంగా రావు. ముందు నుంచి మీ కుటుంబ సభ్యులు ఉద్రేకంగా ఉన్నారు కాబట్టి సహనం వహించండి. రోజంతా శాంతంగా ఉండడం మంచిది. కానీ మీకు ఇంట్లో ఉన్న ఇబ్బంది ఉద్యోగం చేసే చోట ప్రభావం చూపకుండా చూసుకోండి. విద్యార్థులు ఈ రోజు పెట్టే ఇబ్బందులను అధిగమించలేరు. మీరు లైఫ్‌ను హాయిగా, ఈజీగా తీసుకుని ఊహల్లో తేలిపోతూనే ఉండండి. కానీ మీ అసలైన లక్ష్యం మరిచిపోకండి. అనుకోని ఖర్చులు ఉన్నాయని గ్రహబలం చెబుతోంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
ఈ రోజు మీకు సాధారణంగా గడుస్తుంది. ఉదయం పూట మీరు ప్రతి రంగంలోనూ చాలా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. కానీ మధ్యాహ్న సమయానికి మీకు ఏ విషయాల్లోనూ ఫలితం దక్కదు. అయినా ధ్యానం చేయడం మరవకండి. ఇష్టదైవాన్ని ప్రార్థించండి. జిమ్‌లో చెమటలు పట్టే వరకు శారీరిక వ్యాయామం చెయ్యండి. మీరు ఈ రోజు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. అందరి ముందు మీ భావాలను ప్రదర్శించకండి. ఒత్తిడి, ఆందోళన మిమ్మల్ని వదిలిపెట్టవు. కానీ మీ మనసు, శరీరము, పని చేసే ఉత్సాహము బాగుండాలంటే వాటిని చైతన్యవంతంగా ఉంచుకోవడానికి తగినంత సమయం మీరు వెచ్చించాలి. అప్పుడు ఎలాంటి ప్రతికూల ప్రభావాలు మీపై పడవు. మీకూ మీ కుటుంబ సభ్యులకు మధ్య గొడవలు తారా స్థాయికి చేరుకుంటాయి. మీరు వారిని గాయపరిచినట్లయితే మళ్లీ సున్నితంగా వ్యవహరించడం ద్వారా మందు పూసే బాధ్యత కూడా మీరే తీసుకోండి. రోజూ కంటే ఈ రోజు ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో వివాదాలు తలెత్తొచ్చు. ప్రతి అడుగు ఆచి తూచి వేయాల్సి ఉంటుంది. ఆర్థికంగా కొంత ఫర్వాలేదు. శివారాధన సత్ఫలితాన్నిస్తుంది.