తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today : ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందో చూసుకున్నారా? - telugu panchangam

Horoscope Today : ఈ రోజు (ఏప్రిల్​ 26) మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope Today
Horoscope Today

By

Published : Apr 26, 2023, 6:11 AM IST

Horoscope Today : ఈ రోజు (ఏప్రిల్​ 26) మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

ఈ రోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభించండి. ఎక్కువగా ఆలోచించి, త్వరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మౌలిక విషయాలను మరిచిపోవద్దు. ఈ రోజు మీరు ఆఫీస్​లో గట్టి పోటీ ఎదుర్కోవాలి. అయినా మీ సహజ గాంభీర్య ముద్రతో మీదైన శైలితో పై చేయి సాధించండి.

తారాబలం మీకు ఈ రోజు అనుకూలంగా లేదు. మీ నిర్ణయమే గొప్పది కాకపోవచ్చు. కాబట్టి మీరు మంచి అవకాశాలు ఏమిటో వెతికి పట్టుకోవాలి. మీరు ఇక్కడ మాత్రం పొరబాటు చేయకూడదు. మీ విధానంలో స్పష్టత ఉండాలి. కొత్త వ్యవహారాలేవీ మొదలు పెట్టవద్దు. ముఖ్యమైన దరఖాస్తులపై మీద సంతకాలు గానీ, కొత్త ప్రాజెక్టులు చేపట్టడం చేయకండి. మీ మాటల్లో ఆవేశం కనిపించకుండా చూసుకోండి.

మీకు సర్వత్రా అనుకూలత ఈరోజు అద్భుతంగా ఉండబోతోంది. మంచి భోజనం చేస్తారు. అలాగే నేడు మీరు కొత్త బట్టలు, ఆభరణాలు కొంటారు. డబ్బు చూసి ఖర్చు చేయండి. మీ కుటుంబంతో, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

అయోమయం, సందిగ్ధం ఈ రోజు మీతో దాగుడుమూతలు ఆడతాయి. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు తీసుకోకూడదు. మీరు మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. లేదంటే కుటుంబ సభ్యులతో చెలరేగే వాదనలు మిమ్మల్ని నిరాశకి గురిచేస్తాయి. కుటుంబసభ్యుల ఖర్చుల కోసం అదనపు డబ్బు దగ్గర పెట్టుకోండి.

మీకు ఈ రోజు కలిసి వస్తుంది. మీ స్నేహితులు మీకు సహాయపడేందుకు ఇష్టంగా ముందుకొస్తారు. వారితో గానీ, మీకిష్టమైన వారితోగానీ ఒక అందమైన ప్రదేశానికి వెళ్లండి. మీరు విలువైన సమయాన్ని వ్యర్థం చెయ్యకండి. ఆర్థిక లాభం ఉంటుందని మీ ఫలితాలు చెబుతున్నాయి. వ్యాపార లబ్ధి ఉందని తారాబలం చెబుతోంది.

ఈ రోజు మీకు ఎంతో బాగుంటుంది. వ్యాపారం, ఉద్యోగం ఏదైనా అంతటా విజయమే. మీరు ఈ రోజు ఏ విషయాన్నీ కొత్తగా ఆరంభించకండి. వృత్తిపరమైన అభివృద్ధి పదోన్నతి ద్వారా, ఆదాయం వృద్ది ద్వారా మీకు కలిసి వస్తుంది. అన్ని విషయాల్లో తారాబలం చాలా అనుకూలంగా ఉంది.

ఈ రోజు వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. మీరు సహోద్యోగుల నుంచి పని విషయంలో ఎలాంటి సహకారమూ పొందలేరు. ప్రయాణం ఉండే అవకాశాలున్నాయి. సృజనాత్మక కార్యకలాపాలు, మేథోపరమైన చర్చలు ఉండవచ్చు. అవి మీ శక్తిని మరింత ఉత్తేజ పరచవచ్చు. విదేశాల నుంచి వచ్చే శుభవార్త వల్ల ఈ రోజంతా ఆనందంగా ఉంటారు.

మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ రోజు శాంతియుతంగా ఉండి, మంచిగా రోజును మొదలుపెట్టండి. కొత్త ప్రణాళికలు వాయిదా వెయ్యండి. మీ తారాబలం అంత బాగా లేదు. ఆర్థిక సంక్షోభం ఉండవచ్చు.

ఈ రోజు మీకు అదృష్టం తళుక్కుమంటోంది. వృత్తిలో, సహోద్యోగుల నుంచి మంచి సహకారం అందుతుంది. స్నేహితులు సహాయపడతారు. వారితో హాయిగా కేరింతలు కొట్టండి. మీరు కావలసినంత సృజనాత్మకంగా ఉండవచ్చు.

వ్యాపారవేత్తలు, వృత్తి నిపుణులు, గృహిణులు, విద్యార్థులు అందరూ జీవితం చాలా సౌకర్యంగా ఉందని నమ్ముతారు. ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, వృత్తిపరమైన జీవితంలో అంతటా ఆనందమే. మీ జీవిత నౌక ఆటు పోట్లూ లేకుండా సాఫీగా సాగుతుంది.

ఈ రోజు ప్రయాణం ఉంటుంది. ఒంటరిగానే మీరు ప్రయాణం చేయాలని సలహా ఇస్తున్నాం. రకరకాల అభిరుచులున్న వ్యక్తులను మీరు వెంట తీసుకెళ్తే వారి ప్రాధాన్యాల కారణంగా మీ మూడ్ పాడవుతుంది. ఒకవేళ అలాంటి పరిస్థితే ఏర్పడితే మీరు సర్దుకుపోయి అందులో సంతోషాన్ని వెతుక్కోండి.

ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఆరంభించండి. ఎక్కువగా ఆలోచించి ఎటూ తేలక, త్వరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మౌలిక విషయాలకు అంటి పెట్టుకునే ఆలోచించండి.

ABOUT THE AUTHOR

...view details