Horoscope Today 9th August 2023 : ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - ఈ రోజు మీ రాశిఫలం 2023 ఆగస్టు 9
Horoscope Today 9th August 2023 In Telugu : ఈ రోజు (ఆగస్టు 9) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
Horoscope Today 9th August 2023
By
Published : Aug 9, 2023, 6:27 AM IST
Horoscope Today 9th August 2023 : ఈ రోజు (ఆగస్టు 9) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
ఈ రోజు మీరు కష్టించి పనిచేసినా ఆశించిన ఫలితాలు వచ్చే సూచనలు లేవు. మధ్యాహ్నం పూట ప్రయాణం చేసేందుకు మీరు అంత ఉత్సాహం చూపరు. సాయంత్రం వేళ ప్రశాంతంగా ఉంటారు. సన్నిహితులతో చర్చలు జరిపే అవకాశం ఉంది.
ఈ రోజు మీ ఇంట్లో వేడుకల సమయం. కుటుంబమంతా వేడుకల్లో ఉంటే.. మీరు ఓ వ్యాపారం విషయంలో బిజీగా ఉంటారు. సాయంత్రం వేళ మీరు వ్యాపార రీత్యా ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా సాధించిన వాటిని ఆస్వాదించడం కన్నా, వృత్తిపరంగా విజయాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తారు.
ఈ రోజు మీరు మీ స్నేహితుల ద్వారా లబ్ది పొందుతారు. సమీప భవిష్యత్‌లో మీకు సాయపడగలిగే వ్యక్తులతో మీరు స్నేహం చేస్తారు. డబ్బుపరంగా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ లబ్ది పొందుతారు. ఈ రోజు ఏదైనా ప్రయాణం కూడా పెట్టుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా లబ్ది పొందగలరు.
ఈ రోజు అంతా భావోద్వేగాలతో గడుస్తుంది. జీవిత దృక్పథం మార్చుకోవాలనే మీ ఆలోచన కారణంగా ఈ రోజు మీరు అన్ని రంగాల్లో రాణిస్తారు. మీరు ఇళ్లు మారే ప్రయత్నం చేస్తారు. లేదా ఇప్పుడు మీరు ఉంటున్న ఇంటినే అందంగా అలంకరించే ప్రయత్నం చేస్తారు. ఏది ఏమైనా ఇది మీకు ఓ ఆశాజకనమైన రోజు.
ఈ రోజు మీ హృదయం గాయపడవచ్చు. మీరు చేసిన పొదుపు కంటే మీ ఖర్చులు పెరిగిపోతాయి. కానీ మీ వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. సంతోషకరమైన జీవితం కోసం మీ భాగస్వామితో చక్కని అనుబంధం ఏర్పరచుకోవడం ఉత్తమం.
తీవ్రమైన ఆలోచన చేయాలనే కోరిక ఈ రోజు మీలో కలుగుతుంది. ప్రకృతి వైపు ఆకర్షితులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వివాదాలు ఏర్పడకుండా చూసేందుకు మీ మాటను అదుపులో పెట్టుకోండి. మీ ఆరోగ్యం కూడా స్వల్పంగా ఇబ్బంది పెడుతుంది. మధ్యాహ్నం తర్వాత మీరు ఏదైనా ప్రయాణం పెట్టుకోండి. ఈ రోజు ఏదైనా కార్యం తలపెడితే.. దానిని మీరు నిర్వర్తించలేరు.
తొందరపడితే నష్టం వాటిల్లుతుంది. ఏదైనా పని చేపట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. లేనిపక్షంలో మీ ప్రయత్నాలన్నీ వృధా అవుతాయి. ఈ రోజు మీకు అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. వ్యాపార పర్యటన చేపట్టే సూచనలున్నాయి. సాయంత్రం మీరు ప్రేమించే వ్యక్తిని ఆశ్చర్యపరిచే ప్రయత్నం చేస్తారు.
ఈ రోజు మీరు మౌనంగా, ప్రశాంతంగా ఉంటారు. ఆత్మశోధన చేసుకుంటారు. మీ భావాలు వ్యక్తం చేసి మీ కుటుంబ సభ్యుల ముందు ఓ సెంటిమెంటల్ వ్యక్తిగా నిలుచుంటారు. మధ్యాహ్నం వేళ వ్యాపార పనులు లేదా సరదా, వినోదాల్లో తీరిక లేకుండా ఉంటారు. సాయంత్రం వేళ మీ జేబు ఖాళీ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ రోజు మీ ఆరోగ్యం క్రమేపీ క్షీణించే అవకాశం ఉంది. కనుక ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. మీరు కష్టపడినదానికి మంచిన ప్రతిఫలం పొందే అవకాశం కనిపిస్తోంది. కానీ దీనికి సమయం పట్టే అవకాశం వున్నందున సహనంతో, నిరాశకు లోనుకాకుండా ఉండండి. మీ ప్రయాణాలను వచ్చే వారానికి వాయిదా వేసుకోండి. మధ్యాహ్నం నుండి మీ తారాబలం బాగుంది. ఈ సమయంలో మీకు ఆరోగ్యపరంగా , ఆర్థికపరంగా, అలాగే ఇతర అన్ని విషయాలలో అనుకూలంగా ఉంటుంది. సాయంత్రం సమయం మంచి సంగీతంతో ఆనందంగా గడుపుతారు.
ఈ రోజు భావోద్వేగానికి లోనవ్వకండి. ఆస్తులు, భూములకు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండండి. మానసికంగా మీకు చికాకుగా అనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మొండిగా ఉంటే మీకు ప్రయోజనం ఉండదు. కనుక పట్టువిడుపుల ధోరణిని అవలంభించండి.
ఈ రోజు మీరు కొత్త పనులు మొదలుపెట్టడానికి అనుకూలమైన రోజు. కానీ మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. తొందరపడి నిర్ణయాలు తీసుకునే ధోరణి మానుకోండి. ఈ రోజు రచయితలకు చాలా మంచి రోజు. కానీ మధ్యాహ్నం తర్వాత గానీ, సాయంత్రానికి గానీ పరిస్థితిలో మార్పు ఉంటుంది. ఆర్థికంగా చాలా ఇబ్బందిపడే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరి మాటలు, ప్రవర్తన మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది. ఈ రోజు ఆస్తికి సంబంధించిన విషయాలను డీల్ చేయకండి. మీలోని ఆందోళన తగ్గడానికి ఆధ్యాత్మికత కార్యకలాపాల్లో పాల్గొనండి.
లక్ష్య సాధన కోసం మీరు చాలా శ్రమిస్తారు. ఇందుకు మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా మంచి సహకారం లభిస్తుంది. మీ మాటని అదుపులో ఉంచుకుంటే, మీకు తగవులు, దెబ్బలాటలు ఉండవు. మొత్తానికి, మీరొక సంపూర్ణ మానవునిగా ఎదిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీరు కొత్త పనులతో హడావుడిగా ఉంటారు. అత్యవసరం కాకపోతే ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.