Horoscope Today Telugu : ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - ఈ రోజు మీ రాశిఫలం 2023 ఆగస్టు 7
Today Horoscope August 7th 2023 In Telugu : ఈ రోజు (ఆగస్టు 7) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
Horoscope Today Telugu
By
Published : Aug 7, 2023, 6:22 AM IST
Horoscope Today August 7th : ఈ రోజు (ఆగస్టు 7) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
ఈ రోజంతా మేష రాశివారికి సుఖంగా, సంతోషంగా గడుస్తుంది. మీరు శారీరకంగానూ, మానసికంగానూ చాలా ఉత్సాహంగా ఉంటారు. కనుక అన్ని పనులూ చాలా సులువుగా పూర్తి చేయగలుగుతారు. మీరు మీ కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. మీకు మాతృ సంబంధమైన లబ్ధి కనిపిస్తోంది. మీరు ఈ రోజు స్నేహితులతో, బంధువులతో హాయిగా, ఆనందంగా గడుపుతారు.
వృషభ రాశి వారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. కచ్చితంగా నిగ్రహం పాటించాలి. ఈ రోజు వివిధ సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంది. అయితే వాటిని మీరు సమర్థవంతంగా ఎదుర్కొంటారు. కానీ గొడవల విషయంలో సంయమనంతో వ్యవహరించడం చాాలా మంచిది.
మిథున రాశివారు ఈ రోజు వివిధ ఆలోచనలతో ఊగిసలాడుతూ ఉంటారు. ఆచరణ సాధ్యం కాని విషయాల్లో, భావోద్వేగంతో కూడుకున్న విషయాల్లో మీరు అతిగా జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఇలాంటి విషయాల్లో మీరు అతిగా స్పందిస్తే.. చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. మీ ఆరోగ్యం, ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టాల్సిన సమయమిది. కనుక మార్పును క్రమంగా అలవర్చుకోండి.
కర్కాటక రాశివారికి ఈ రోజు గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. మీరు నిన్నటి నుంచి అనుభవిస్తున్న అదృష్టం అంతా అలాగే కొనసాగుతుంది. అరుదైన బహుమతులను స్వీకరించండి. ఆఫీసులో, ఇంటిలో అంతా మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
ఈ రోజు సింహ రాశివారికి సాధారణంగా గడుస్తుంది. మీరు అనుకున్న పనిని పూర్తి చేస్తారు. ఈ రోజు మీరు మీ లక్ష్యం దిశగా నడక సాగిస్తారు. ధార్మిక కార్యక్రమాలు మిమ్మల్ని తీరిక లేకుండా చేయవచ్చు. మీరు ఒక తీర్థయాత్రకి ప్రణాళిక వేస్తారు. వాస్తవానికి ఇవాళ మీరు కొంచెం కోపంగా ఉంటారు. విదేశాల్లో నివసించే బంధువుల నించి వార్తలు తెలుస్తాయి. మీకు మానసిక శాంతి కొరవడుతుంది. పిల్లలకు సంబంధించిన మనస్తాపం ఉండవచ్చు. వ్యాపారస్తులకు ఈ రోజు అంతగా కలిసి రాదు.
కన్య రాశి వారు ఈ రోజు ఒక విప్లవాత్మక ఆలోచన చేస్తారు. మీ స్నేహితులు తమ భవిష్యత్తు ప్రణాళికల గురించి మీ వద్ద ప్రస్తావించే అవకాశం ఉంటుంది. అవి మీ ఊహకు ఉత్సుకతను కలిగించే అవకాశం ఉంది. అందుకే ఆ దిశగా పయనం సాగించాలని భావిస్తారు. కానీ ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. ఆ పనులు అనుకున్నంత సరళంగా ఉండవు. వాటి పర్యవసానాలు కూడా చాలా కఠినంగా ఉండే అవకాశం ఉంది.
ఈ రోజు మీరు పూర్తిగా ఆనందంగా ఉంటారు. ఈ రోజు మీరు మంచి ఆహారం, పానీయాలను పుచ్చుకుంటారు. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులతో కలిసే అవకాశం ఉంది. మీ పాత స్నేహితుల సాన్నిహిత్యం మిమ్మల్ని ఉత్తేజపరిచే విధంగా, చైతన్యపరిచే విధంగా, ఆనందకరంగా ఉంటుంది.
ఈ రాశి వారికి ఇది చాలా మంచి రోజు. మంచి రోజు అవడం వలన మీరు మీ కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా సమయాన్ని గడుపుతారు. మీ సంతోషం రెట్టింపు చేసే విధంగా.. మీ ఇంటి వద్ద నుంచి మంచి వార్తలు వింటారు. మంచి సహాయ సహకారాలు అందించే సిబ్బంది ఉండుట వలన మీ పనులు పూర్తి చేయుటకు మంచి వాతావరణం ఉంటుంది. చాలా కాలం నుంచి పూర్తి కాని పనులు.. ఈ రోజు పూర్తి చేయుటకు అవకాశం ఉంది. అలాగే ఆర్థికపరమైన లాభాలు మీ కొరకు ఎదురు చూసున్నాయి.
మీరు నక్షత్రాలు, గ్రహ సమస్యల నుంచి ఇంకా కోలుకున్నట్లు అనిపించడం లేదు. ఫలితంగా, పూర్తి అస్వస్థతతో ఉంటారు. లేదా మానసికంగా అస్థిర భావనకు లోనవుతారు. మీరు జీర్ణసంబంధ రోగాలకు తీసుకునే మందుల విషయంలో జాగ్రత్త వహించండి. ఇది గత రెండు రోజుల నుంచి ఉన్న ఒత్తిడి కారణంగా సంభవించిన ఎసిడిటీ వలన కావచ్చు.
ఈ రోజు మీకు శుభప్రదమైన రోజు అని ఫలితాలు చెప్తున్నాయి . శారీరకంగా, మానసికంగానూ మీరు ఇవాళ చాలా ఉత్సాహంగా గడుపుతారు. అనుకోని సంఘటనలు మీ కుటుంబ సభ్యులను బాధిస్తాయి. మీరు దాని గురించి ఆందోళన చెందుతారు. మీరు నిద్రలేమితో బాధ పడతారు. మీరు నీళ్లను పొదుపుగా వాడండి. ఆడవారి విషయంలో జాగ్రత్త వహించండి. మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు. కొన్ని సంఘటనల కారణంగా మీ పరువుకు భంగం కలిగే అవకాశం ఉంది.
ఈ రోజు మీరు మానసికంగా గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ కారణంగా సులభమైన పరిష్కారాలు కనుగొనడంలోనూ ఇబ్బందిపడతారు. మీ రోజువారీ పనులను సక్రమంగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. అనవసరపు ఆలోచనలకు, వివాదాలకు దూరంగా ఉండండి.
మీరు ఈ రోజు అతిగా డబ్బులు ఖర్చు చేయకుండా జాగ్రత్తపడండి. మీరు మీ మాటలను, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. డబ్బుకు సంబంధించిన వ్యవహారాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. రోజు మొత్తం మీ మానసిక, శారీరక దృఢత్వం సాధారణంగా ఉంటుంది. ప్రతికూలమైన ఆలోచనలు మిమ్మల్ని నిరాశ పరచకుండా చూసుకోండి.