Horoscope Today Telugu : ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - ఈ రోజు మీ రాశిఫలం 2023 ఆగస్టు 4
Today Horoscope August 4th 2023 In Telugu : ఈ రోజు (ఆగస్టు 4) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
By
Published : Aug 4, 2023, 6:27 AM IST
Horoscope Today August 4th : ఈ రోజు (ఆగస్టు 4) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
ఈ రోజు చాలా ఆహ్లాదకరంగా గడుపుతారు. ఎటువంటి ఆందోళనలు ఉండవు. కానీ మీరు ఒకేసారి అనేక విషయాలను చేపడతారు. ఇది మీకు తీరికలేకుండా చేసి ఒత్తిడిని పెంచుతుంది. ఆచరణాత్మకంగా వ్యవహరించండి. అతిగా భారాన్ని మీ మీద వేసుకోకండి. వాస్తవికంగా, సహేతుకంగా ఉండండి.
రోజూవారీ పనుల నుంచి కాస్త బ్రేక్ తీసుకుంటారు. సరదాగా విహార యాత్రకు వెళ్లే సూచనలున్నాయి. మీరు మహిళలైతే పురుషులను, పురుషులైతే మహిళలను సహజంగా ఆకట్టుకుంటారు. మీరు ఎవరినైనా ప్రేమిస్తే వారితో ఈ రోజు ఆ విషయాన్ని వ్యక్తం చేస్తారు. సాయంత్రం వేళ మీరు మందులు తీసుకోవడమో లేదా మీ ప్రియమైన వ్యక్తులకు సేవ చేయడమో జరుగుతుంది.
ఈరోజు కొత్త పనులు చేపట్టడానికి శుభప్రదంగా లేదు. మీరు అలసటతో, బద్ధకంగా, నిరుత్సాహకరంగా ఉంటారు. కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. వృత్తిపరంగా, పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండవు. మీ యజమానులు మీ పని పట్ల అసంతృప్తిగా ఉంటారు. అనవసరమైన ఖర్చులు చేసే అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రణాళికలు, నిర్ణయాలు అన్నీ వాయిదా వేసుకోవడం మంచిది.
మీరు ఈరోజు ఏ పని చేసినా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంతో ఘర్షణలు మానుకోండి. రోజు మొత్తం మర్యాదపూర్వకంగా ఉండండి. అది మిమ్మల్ని సమస్యల నుంచి దూరం చేస్తుంది. ఊహించని ఖర్చులకు సిద్ధంగా ఉండండి. మీరు అనైతికమైన, చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నుంచి దూరంగా ఉంటే మంచిది. ప్రార్థనలు, ధ్యానం లాభం చేకూరుస్తాయి.
ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో సరదాగా గొడపడవచ్చు. వైవాహిక జీవితం ఆనందకరంగా ఉంటుంది. మీ విబేధాలు మీ ఆరోగ్యంపైన ప్రతికూల ప్రభావం చూపకుండా నిర్ధరించుకోండి. పరిస్థితులు క్లిష్టంగా మారవచ్చు. మీ ప్రతికూలతకు సాధారణ సమస్యలు తోడవుతాయి. ప్రజా విషయాల్లో మీకు చెడ్డ పేరు తెచ్చే పనులు మానుకోండి.
ఈ రోజు వృత్తినిపుణులకు, వ్యాపారస్థులకు అద్భుతమైన రోజు. మీ పోటీదారులు, భాగస్వాములు, సహోద్యోగుల కంటే మీరు ఒక మెట్టు ఎత్తులో ఉంటారు. సహోద్యోగులు మీతో స్నేహపూర్వకంగా ఉంటూ సాయాన్ని అందిస్తారు. గృహానికి సంబంధించి మీరు చాలా ఆనందంగా, సంతృప్తిగా ఉంటారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశం చాలా తక్కువగా ఉంది.
మీ అద్భుతమైన ప్రవర్తనతో స్నేహితులు, అపరిచితులను గెలవడం సాధ్యమవుతుంది. చర్చల్లో, వాదనల్లో, మీ ఆలోచనా విధానం ఇతరులను ఆకట్టుకోగలదు. అది ప్రభావితం కూడా చేయగలదు. పనికి సంబంధించి, మీ కృషికి తగ్గ ఫలితం లభించకపోవచ్చు. పని ప్రదేశంలో నిరాడంబరంగా ఉండటానికి ప్రయత్నించండి.
ప్రాణ స్నేహితులు, బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ శారీరక, మానసిక దృఢత్వం మీకు చాలా ఆందోళన కలిగించవచ్చు. మీ తల్లిగారు కూడా ఏదో ఒక అనారోగ్యంతో బాధపడవచ్చు. మీ ఆర్థిక వనరులు, పేరు ప్రతిష్ఠలు కూడా ఈరోజు దెబ్బతినవచ్చు. అనారోగ్యం, అభిరుచుల విబేధాలతో కుటుంబంలోని ప్రశాంతతకు విఘాతం కలగవచ్చు.
మీ కఠిన శ్రమ, ప్రణాళిక అంతా వృథా అవుతుంది. కాబట్టి మీరు తీవ్ర నిరాశలో కూరుకుపోతారు. ఇతరులతో ఏర్పడే అభిప్రాయభేదాలు తీవ్రరూపం దాల్చి అవి వాదనకు దారితీస్తాయి. ఇలాంటి పరిస్థితి మీ ఒత్తిడిని మరింత తీవ్రతరం చేస్తాయి. దీనికి మీరు నిరాశపడకండి. ఈ సమస్యల నుంచి మీరు కచ్చితంగా గట్టెక్కుతారు.
భవిష్యత్ ఆలోచనలతో మీరు ఒకింత ఒత్తిడికి గురవుతారు. ప్రణాళికలు మంచివే. కాని మీరు వాస్తవంలో ఉండాలి. మీ కలలను నిజం చేసే దైవిక శక్తిని మీరు అందిపుచ్చుకోవాలి. పనిలో మీరు ఇప్పటికే సంపాదించుకున్న పేరుకు మరింత ప్రతిష్ఠ జతకలుస్తుంది.
మీరు చాలా లాభాలు పొందుతారు. కానీ, మీరు వ్యతిరేకంగా ఆలోచించడం వల్ల ప్రతి ఫలాలను పొందలేరు. మీ అర్థిక స్థితి బాగానే ఉంటుంది. మీకు ఇష్టమైన వారి నుంచి బహుమతులు అందుకుంటారు. వాటిని ఆనందంగా స్వీకరించండి. ఆరోగ్యం బాగా ఉంటుంది. మీ స్నేహితులతో కలసి విహార యాత్ర పర్యటన చేస్తారు. వ్యాపారం కూడా బాగుంటుంది. వివాహం జరిగే అవకాశం ఉంది.
మీ సాధారణ స్నేహితులతో కొన్నిసార్లు మీకెంతో మేలు జరుగుతుంది. వారి ద్వారా మీరు కొన్ని ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడతారు. స్నేహితులకున్న విలువేంటో మీరు ఈ రోజు అర్థం చేసుకుంటారు.