Horoscope Today 17th August 2023 : కుంభ రాశి వారు.. ఈ రోజు ఏం పట్టినా బంగారమే! - ఆగస్టు 17 రాశి ఫలాలు
Horoscope Today 17th August 2023 In Telugu : ఈ రోజు (ఆగస్టు 17) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
Horoscope Today 17th August 2023 In Telugu
By
Published : Aug 17, 2023, 5:00 AM IST
Horoscope Today 17th August 2023 In Telugu : ఈ రోజు (ఆగస్టు 17) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : పెండింగ్లో ఉన్న పనులను ఈ రోజు పూర్తి చేస్తారు. సంతానం ఉన్న వారు వారి పిల్లలను బుజ్జగిస్తారు. మీ శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. వైద్యవృత్తి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు శుభప్రదమైన రోజు.
వృషభం (Taurus) : మీ సృజనాత్మకత మీలోని పోటీతత్వానికి తోడుగా నిలుస్తుంది. మీ సామర్థ్యాన్ని ప్రతిఒక్కరూ గుర్తిస్తారు. ప్రావీణ్యమైన మీ పనితీరుతో అందర్ని ఆశ్చర్యపరుస్తారు. మీ సహచరులను ఈ రోజు మీరు ప్రభావితం చేస్తారు.
మిథునం (Gemini) : ఈ రోజు చాలా ఎమోషనల్గా ఫీలవుతారు. ఇది మీకు ఇబ్బందికరంగా మారుతుంది. ఎవరి స్వభావం ఎలాంటిదో మీరు అస్సలు గుర్తించలేరు. సాయంత్రానికి మీరు శుభవార్త వింటారు.
కర్కాటకం (Cancer) : ప్రేరణనిచ్చే మాటలతో ఈ రోజు ప్రారంభమవుతుంది. భవిష్యత్ గురించి ప్రణాళికలను రూపొందించుకునే పనిలో నిమగ్నమవుతారు. పని విషయంలో ప్రణాళికలను అమలు చేయడం మొదలుపెడతారు. ఫ్యూచర్ ప్లాన్స్ రూపొందించుకోవడం ద్వారా చాలా పనులు చేసుకునేందుకు మీకు తగిన సమయం దొరుకుతుంది. మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
సింహం (Leo) : మంచి ఆలోచనతో కూడిన వేగవంతమైన నిర్ణయాలను ఈ రోజు మీరు తీసుకుంటారు. ఆరోగ్యకరంగా, శక్తిమంతంగా, ఉత్సాహంగా ఉన్నట్టు మీకు అనిపిస్తుంది. పని విషయంలో అధిక శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. వ్యక్తిగత వాదనలకు దిగుతారు. మీ దూకుడును అదుపులో ఉంచుకుంటూ జాగ్రత్తగా ఉండండి.
కన్య (Virgo) :కుటుంబ విలువలను ఈ రోజు మీరు గ్రహిస్తారు. మీ మాటలతో అపరిష్కృతంగా ఉన్న వివాదాలకు ముగింపు పలుకుతారు. మీ వాస్తవిక ధోరణి కారణంగా జీవితంలో చాలా విషయాలను తెలుసుకుంటారు. ప్రత్యర్థులు ఉంటేనే నిజమైన పురోగతిని సాధిస్తామనే మాటను నమ్ముతారు.
తుల (Libra) : ఈ రోజు మీ ముందుకు వచ్చే ప్రతిదాన్ని ఆస్వాదించండి. మీ పనిప్రదేశంలో ఎదురయ్యే రకరకాల అవకాశాల నుంచి ఒకదానిని మీరు ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో ఆందోళన చెందకండి. ఇష్టదైవాన్ని స్మరించుకోండి అంతా మంచి జరుగుతుంది.
వృశ్చికం (Scorpio) :ఈ రోజు చాలా తుంటరితనాన్ని ప్రదర్శిస్తారు. వదంతులను దూరం పెట్టడంలో మీరు కీలకంగా వ్యవహరిస్తారు. చాలా మందిని మీరు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. దీంతో వారు మిమ్మల్ని అనుకరించే ప్రయత్నం చేస్తారు. సంతోషాన్ని పంచండి. ఫలితంగా పదిరెట్ల ఆనందాన్ని ఈ రోజు మీరు పొందుతారు.
ధనుస్సు (Sagittarius) : పని పట్ల మీరు చూపే సంకల్పం, నిబద్ధతలు మీకు భారీ స్థాయిలో పనులను తెచ్చిపెడతాయి. పనికి కట్టుబడిపోయే వ్యక్తిగా మీరు మారే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రానికి మీకు విశ్రాంతి లభిస్తుంది.
మకరం (Capricorn) : ఏదైనా న్యాయవివాదంలో మీరు ఇరుక్కుంటే దాన్ని నిరంతరం నిశితంగా గమనిస్తూ ఉండండి. ఏ అవకాశాన్ని వదులుకోకండి. ఆర్థికంగా నష్టాలు సంభవిస్తాయి. ఒకవేళ మీరు వ్యాపార రంగంలో ఉన్నట్లయితే ఈ నష్టాలు తీవ్రస్థాయిలో ఉంటాయి. వీటిని నివారించేందుకు అప్రమత్తంగా పాటించండి.
కుంభం (Aquarius) : తారాబలం ఈ రోజు అనుకూలంగా ఉంది. దీంతో మీరు విశ్వాసం, దృఢ నిశ్చయాన్ని కలిగి ఉంటారు. అందమైన దుస్తులను ధరిస్తారు. చిన్న పర్యటన ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. స్నేహితుల ద్వారా సాంస్కృతిక విషయాల్లో లాభపడవచ్చు. మొత్తంగా ఈ రోజు సాఫీగా సాగుతుంది. సామాజిక పరపతి బలాన్నిస్తుంది. మంచి భాగస్వామ్యం లాభిస్తుంది.
మీనం (Pisces) : ఉన్నత స్థానంలో నిలవాలనుకుంటే సృజనాత్మకంగా వ్యవహరించండి. మీలో కొత్త మార్గాలను వెలికి తీయండి. మీ వృత్తే మీ అభిరుచైతే ఇతరులకంటే మీరు ఉన్నతంగా ఉండేందుకు అవకాశం ఉంది.