Horoscope Today 13th August 2023 : ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - ఆగస్టు 13 మీ రాశి ఫలం ఎలా ఉందంటే
Horoscope Today 13th August 2023 In Telugu : ఈ రోజు (ఆగస్టు 13) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
Horoscope Today 13th August 2023
By
Published : Aug 13, 2023, 6:25 AM IST
Horoscope Today 13th August 2023 : ఈ రోజు (ఆగస్టు 13) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : ఈ రోజు మీకు బాగా కలిసివచ్చే రోజు. మీకు ఏమి ఉందో.. దానితోనే మీరు సంతృప్తి చెందుతారు. దీనికి తోడు మీరు ఇప్పటికే మీకు ఏం కావాలో ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు. స్త్రీ సాంగత్యం కలిగే అవకాశం ఉంది. కానీ అది వివాదానికి దారితీసే పరిస్థితులు గోచరిస్తున్నాయి.
వృషభం (Taurus) : మీ తీరిక లేని షెడ్యూల్ నుంచి కొంత సమయం తీసుకొని సరదాగా, ప్రశాంతంగా గడపాల్సిన రోజు ఇది. ఈ రోజు మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సాయంత్రం సరదాగా గడుపుతారు. చక్కని భోజనం చేస్తారు. కుదిరితే రాత్రి సినిమాకు వెళ్తారు. వేడి వేడి నోరూరించే వంటకాలు తినాలనే కోరిక మీలో బాగా పెరుగుతుంది. అది తీర్చుకుంటారు కూడా.
మిథునం (Gemini) : ఈ రోజు మీరు చాలా ఒత్తిడికి గురవుతారు. మీ శక్తియుక్తలను చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సి ఉంటుంది. మీ భావోద్వేగాలు చాలా వేగంగా మారుతూ ఉంటాయి. కనుక ధ్యానం చేసి, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం మంచిది.
కర్కాటకం (Cancer) : ఇంట్లో కొత్త వంటల ప్రయోగాలు చేస్తారు. కుటుంబ సభ్యులు దాన్ని ఆస్వాదిస్తారు. సరదాగా మీరు సమయాన్ని గడుపుతారు. ఇంటికి అతిథులు రావడం వల్ల పండగ వాతావరణంతో సందడి నెలకొంటుంది.
సింహం (Leo) : ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. స్నేహితులతో సహా, మీ వ్యతిరేక వర్గంవారు కూడా మీ పట్ల దయ కలిగి ఉంటారు. అందమైన ప్రదేశానికి వెళ్లే సూచనలు ఉన్నాయి. కానీ మీరు జాప్యం చేస్తే ఆ అవకాశం చేజారిపోతుంది.
కన్య (Virgo) :విశ్రాంతి తీసుకొని ప్రశాంతంగా గడపటం మీకు మేలు చేస్తుంది. ఇవాళ మీపై పనిభారం చాలా తీవ్రంగా ఉంటుంది. సహనంగా వ్యవహరిస్తూ సమస్యలను దూరం పెట్టండి. మీ ప్రేమ జీవితంలో కొత్త అడుగు పడుతుంది.
తుల (Libra) : మీరు పనిచేసే రంగంలో మీ సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని ప్రదర్శించి, అందరినీ ఆకట్టుకుంటారు. కళ, కళాత్మక విషయాలపై మీకు అభిరుచి పెరుగుతుంది. కొత్త కళాఖండాన్ని మీరు ఈ రోజు కొనుగోలు చేస్తారు.
వృశ్చికం (Scorpio) :ఈ రోజు మీకు పని ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంటుంది. దాన్ని తట్టుకునే సామర్థ్యం మీకు ఉంటుంది. ఈ రోజు ఒత్తిడిని పారదోలేందుకు యోగా, ధ్యానం లాంటి పనులు చేయండి. లేదా ఆహ్లాదకరమైన సంగీతాన్ని వినండి.
ధనుస్సు (Sagittarius) : కష్టాలు ఎల్లకాలం ఉండవనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రోజు మీరు చాలా ఒడుదొడుకులు ఎదుర్కొంటారు. అయితే మీరు మంచి సారంగు కనుక.. ఎగిసిపడుతున్న సముద్రం నుంచి మీ సమస్యల నావను సులభంగానే ఒడ్డుకు చేర్చుతారు. మీ సన్నిహితులు, ప్రియమైన వారు ఇచ్చే సలహాలు స్వీకరించండి.
మకరం (Capricorn) : వ్యాపార విస్తరణ పనులు ఈ రోజు బాగా లాభదాయకంగా ఉంటాయి. అనుకున్న రీతిలో పనులు సాగుతాయి. ఆర్థికపరమైన లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. ఎటువంటి అడ్డంకులు లేకుండా వ్యాపారం కొనసాగుతుంది. భాగస్వాములు, సహోద్యోగులు సహకరిస్తారు.
కుంభం (Aquarius) : ఈ రోజు ఓ ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఒంటరిగానే మీరు ప్రయాణం చేయడం మంచిది. రకరకాల అభిరుచులున్న వ్యక్తులను మీరు వెంట తీసుకెళ్తే, వారి ప్రాధాన్యాల కారణంగా మీ మూడ్ పాడవుతుంది. ఒకవేళ అలాంటి పరిస్థితే ఏర్పడితే మీరు సర్దుకుపోయి.. అందులోనే సంతోషాన్ని వెతుక్కోవడం ఉత్తమం. బలహీనతను బలంగా మార్చుకునే సామర్థ్యం మీలో ఉంది.
మీనం (Pisces) : ఈ రోజు ఒక సాధారణమైన రోజు. ఈ రోజు మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఆరంభించండి. ఎక్కువగా ఆలోచించి ఎటూ తేల్చుకోలేక , త్వరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మౌలిక విషయాలకు అంటి పెట్టుకునే ఆలోచించండి. ఈ రోజు మీరు ఆఫీస్లో గట్టి పోటీ ఎదుర్కోవాల్సి రావచ్చు. అయినా మీ సహజ గాంభీర్య ముద్రతో, మీదైన శైలితో పైచేయి సాధిస్తారు. మాట్లాడేది జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రయాణాలు ఉండవచ్చు.