తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today 10th August 2023 : ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today 10th August 2023 In Telugu : ఈ రోజు (ఆగస్టు 10) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today 10th August 2023
Today Horoscope 2023 August 10th In Telugu

By

Published : Aug 10, 2023, 6:07 AM IST

Horoscope Today 10th August 2023 : ఈ రోజు (ఆగస్టు 10) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

ఈ రోజు మీరు కాస్త పట్టు, విడుపు ధోరణి పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల అవసరాలకు, కోరికలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. కోపం అదుపులో పెట్టుకోవాలి. జాగ్రత్తగా మాట్లాడాలి. అనవసరపు వాదనల్లోకి దిగి, అపవాదుల్ని మీదకు తెచ్చుకోకండి. అనవసర ఖర్చులు పెట్టకండి.

ఈ రోజు మీకు ఆర్థిక వృద్ధి, ధన లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయని రాశి ఫలితాలు చెబుతున్నాయి. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ రోజు మీరు సంతోషంగా గడుపుతారు. వినోద కార్యకలాపాలకు డబ్బు ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

ఈ రోజు మీరు.. మీ ప్రియమైన వారితో లేదా మీ కొడుకుతో వాదనలకు దిగే అవకాశం ఉంది. మీరు మీకు మాత్రమే తెలిసిన కారణాల వల్ల చాలా చికాకుగా, కోపంగా ఉంటారు. మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. లేదంటే మీరు ప్రియమైన వారిని గాయపరిచి, బాధించే అవకాశం ఉంది. ఈ దూకుడు మీ ఆరోగ్యంపైన కూడా ప్రతికూలమైన ప్రభావం చూపుతుంది.

మీ ఆదాయ వనరులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అందువల్ల మీరు మీ కుటుంబంతో, స్నేహితులతో కలిసి ఒక ఆనందకరమైన పర్యటన చేసే అవకాశం ఉంది. అలాగే తోటి ఉద్యోగులకు, స్నేహితులకు మంచి పార్టీ ఇచ్చే అవకాశం ఉంది. మీ కొడుకు లేదా మీ బంధువుల్లోని చిన్నవారితో ఉల్లాసంగా స్విమ్మింగ్ చేయడానికి ఇది మంచి రోజు.

విశ్వాసం, దృఢ నిశ్చయం మీ జీవితంలో అద్భుతాలు సృష్టిస్తాయి. మీరు అన్ని పనులూ సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. తారాబలం, అదృష్టం కలిసిరావడం వల్ల ప్రమోషన్ పొందే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. ఆస్తి సంబంధించి మీకే అనుకూలత ఉంది. సింహరాశి వారి బలం అపరిమితంగా ఉంటుంది. అది వారికి గుర్తింపు తీసుకురావచ్చు. ఈ రోజు ప్రభుత్వ విషయాలకు సంబంధించి, ఫైనాన్సియల్​ డాక్యుమెంట్లు చూడడానికి ఇది మంచి రోజు.

ఈ రోజు కన్య రాశి వారికి అంతా అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ రోజును ధ్యానాది ధార్మిక కార్యక్రమాలతో మొదలుపెట్టండి. మీకు అంతా మంచే జరుగుతుంది. మీరు ఈ రోజు స్నేహితులను కలుసుకుంటారు. మీ సన్నిహితుల సహకారం మీకు లభిస్తుంది. విదేశాలలో ఉన్న మిత్రుల నుంచి మంచి సమాచారం వింటారు. ఈ రోజంతా సరదాగా, సంతోషంగా గడుపుతారు.

ఈ రోజు మీరు ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. కఠినంగా మాట్లాడి తరువాత బాధపడినా ప్రయోజనం ఉండదు. కోపం వల్ల ఏ సమస్యలూ తీరవు. కనుక మాట్లాడేది జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు సమస్యలు తీరాలంటే ఆధ్యాత్మిక ప్రార్థనలు, ధ్యానం చేయడం మంచిది. అందువల్ల సమస్యలతో పోరాడే శక్తి మీకు లభిస్తుంది. అనైతికమైన, చట్ట విరుద్ధమైన పనులు చేయకండి. మీరు ఏర్పరుచుకుంటున్న కొత్త సంబంధం ఎక్కువ కాలం నిలవకపోవచ్చు. ఆర్థిక సంబంధమైన లెక్కలు ఒక దగ్గర రాసిపెట్టుకునే ప్రయత్నం చేయండి.

ఈ రోజు మీ బాధ్యతలు మీ ఇంట్లోనే వదిలేయండి. కావలసినంత సరదా, సంతోషాలు మీ కోసం ఎదురు చూస్తున్నాయని ఫలితాలు చెబుతున్నాయి. ఈ రోజు స్నేహితులతో కలిసి బయటకు వెళతారు. వారితో సంతోషంగా గడుపుతారు. మీరు ఎడ్వంచరస్ ట్రిప్​కు వెళ్లే అవకాశం ఉంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.

మీ తారాబలం ఈ రోజు ఎంతో అద్భుతంగా ఉంది. అదృష్టం అవకాశాల రూపంలో కలిసి రాబోతోంది. మీరు మానసికంగానూ, శారీరకంగానూ బలంగా ఉంటారు. ఈ రోజు మీరు బాగా ఆనందంగా గడుపుతారు. మీ ఇంట్లో, పని ప్రదేశంలో శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది. మీకు అన్ని చోట్లా సహాయ సహకారాలు లభిస్తాయి. మాతృ సంబంధమైన సమాచారం విని మీరు మరింత ఆనందపడతారు. ఈ రోజు మీరు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు.

ఈ రోజు మీకు వచ్చే అనారోగ్యం మీ ఆనందాన్ని హరిస్తుంది. మనసు బాగా లేకపోవడం వల్ల గాబరాగా ఉంటుంది. నిర్ణయం తీసుకునే శక్తి కొరవడుతుంది. ఈ రోజు మీ తారాబలం అంత బాగా లేదు. మీ పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ప్రాణాయామం చేయండి. విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయండి.

ఇదొక సాధారణమైన రోజు. మీ మంకుతనాన్ని అదుపు చేసుకోండి.. ప్రతికూల పరిస్థితుల వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. కుటుంబ సభ్యులతో మీ జీవితం సాఫీగా గడవదు. సామాజికంగా మీ పరపతి దెబ్బతినే పనులు చేయవద్దు. ఇల్లు, ఆస్తి సంబంధమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. విద్యార్థులు శ్రద్ధ పెట్టి చదువాల్సిన ఈ సమయంలో.. ఈ రోజు కాస్త ఆటవిడుపుగా ఉంటుంది. మీరు మీ ఆర్థిక వనరులని పెంచుకుని, లాభాలు గడించే సూచనలు గోచరిస్తున్నాయి.

ఈ రోజు మీరు 'కష్టపడి పని చేయండి.. చక్కగా ఆనందించండి' అనే సూత్రాన్ని బాగా ఇష్టపడతారు. ఈ రోజు మీ అదృష్టం వింత నడకలు నడుస్తుంది. మీరు మీ సృజనాత్మకతను ప్రదర్శించి, అందరి మన్ననలను పొందుతారు. నూతన దృక్పథంతో నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని త్వరలో అమలు కూడా చేస్తారు. మీ అనుకూల వైఖరి, నిర్ణయాత్మక శక్తికి అనుగుణంగానే.. పనులు పూర్తి చేస్తారు. ఒక సాహసోపేతమైన పర్యటనకు స్నేహితులతో, రక్త సంబంధీకులతో కలిసి వెళ్లే అవకాశం ఉంది. ఈ మీన రాశివారికి సమాజంలో తగినంత గుర్తింపు లభిస్తుందని రాశి ఫలితాలు సూచిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details