తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today : ఈ రోజు రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

HOROSCOPE
రాశి ఫలాలు

By

Published : Sep 3, 2022, 6:17 AM IST

Horoscope Today : ఈ రోజు(సెప్టెంబరు 3) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

తలపెట్టిన కార్యాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కోపం తగ్గించుకుంటే మంచిది. గోసేవ చేస్తే శుభ ఫలితాలుంటాయి.

ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. లక్ష్మీదేవి సందర్శనం ఉత్తమ ఫలితాన్నిస్తుంది.

మంచి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. మీ కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. అనూహ్య ధనలాభం పొందుతారు. లక్ష్మీదేవి ఆరాధన శుభాన్నిస్తుంది.

కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. హనుమాన్ చాలీసా పఠించాలి.

శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ద్వాదశ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీ విష్ణు ఆరాధన చేయడం మంచిది.

కీలక విషయాల్లో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. సుబ్రహ్మణ్య భుజంగస్తవము చదివితే శుభం కలుగుతుంది.

మిశ్రమ కాలం. ఉత్సాహంగా పనిచేయాలి. గొప్ప సంకల్పబలంతో తలపెట్టిన కార్యాలను పూర్తిచేస్తారు. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సందర్శనం మంచి ఫలితాన్నిస్తుంది.

పట్టు వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. శని ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితములు పొందుతారు.

సంతృప్తికర ఫలితాలను రాబట్టేందుకు ఇది సరైన సమయం. చేపట్టిన కార్యాల్లో పురోగతి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సౌభాగ్య సిద్ధి ఉంది. ఇష్టదేవత స్తోత్రము పఠించడం మంచిది.

పెద్దలు సూచించిన మార్గంలో ముందుకుసాగి మంచి ఫలితాలను సాధిస్తారు. ధనధాన్య లాభాలున్నాయి. మనః సౌఖ్యం కలదు. నూతన వస్తువులను సేకరిస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగండి మంచి జరుగుతుంది. హనుమాన్‌ ఆరాధన శుభప్రదం.

శ్రమ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి తగిన సహాయం చేసేవారు ఉంటారు. ఆంజనేయ స్తోత్ర పారాయణం చేస్తే మంచిది.

ABOUT THE AUTHOR

...view details