తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - horoscope for today

Horoscope Today: ఈ రోజు(సెప్టెంబరు 29) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

HOROSCOPE TODAY SEPTEMBER 29 THURSDAY
HOROSCOPE TODAY SEPTEMBER 29 THURSDAY

By

Published : Sep 29, 2022, 6:27 AM IST

Horoscope Today: ఈ రోజు(సెప్టెంబరు 29) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

యశోవృద్ధి ఉంది. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. అనుకున్నది సాధిస్తారు. మనఃస్సౌఖ్యం ఉంటుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం మేలు చేస్తుంది.

ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ధర్మసిద్ధి ఉంది. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శ్రీ రామ నామస్మరణ మేలు చేస్తుంది.

ముఖ్యవిషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు అవసరమవుతాయి. శత్రువుల జోలికి పోకుండా ఉండటం మంచిది. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గణపతి సందర్శనం శుభప్రదం.

ఒక వ్యవహారంలో మీకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు తప్పకపోవచ్చును. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. రాహు శ్లోకాన్ని చదువుకోవడం మంచిది.

మొదలుపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని కలిగిస్తాయి. బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆంజనేయ స్వామిని ఆరాధించాలి.

చేప్పట్టే పనుల్లో సంతృప్తికర ఫలితాలను సాధిస్తారు. మనః సంతోషాన్ని పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.

మీలోని పోరాట పటిమ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. అధికారులు మీపట్ల మిశ్రమ వైఖరితో ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. శ్రీ వేంకటేశ్వరసందర్శనం శుభప్రదం.

ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి మొదలుపెట్టాలి. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది

శుభకాలం. అనుకున్న పనులను పూర్తిచేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ధార్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శని శ్లోకాన్ని చదివితే మంచిది.

ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

ఆశించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. నవగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠిస్తే అన్నివిధాలా మంచిది.

చేపట్టిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. అలసట పెరుగుతుంది. మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. నిరుత్సాహపరిచే సంఘటనలకు దూరంగా ఉండాలి. ఇష్టదేవతా నామస్మరణ ఉత్తమం.

ABOUT THE AUTHOR

...view details