ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందంటే? - శంకరమంచి శివసాయి శ్రీనివాస్ రాశి ఫలాలు
Horoscope Today: ఈ రోజు(సెప్టెంబరు 25) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
horoscope-today-september-25-sunday
By
Published : Sep 25, 2022, 6:23 AM IST
Horoscope Today: ఈ రోజు(సెప్టెంబరు 25) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
బుద్ధిబలంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. మనఃస్సౌఖ్యం ఉంది. ఇష్టదైవారాధన మంచినిస్తుంది.
మనోబలంతో చేసే పనులు సఫలమవుతాయి. తోటి వారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. దుర్గ ధ్యానం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆదిత్య హృదయం పఠించాలి.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూల ఫలితాలున్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదేవత స్తోత్రం పఠించడం మంచిది.
శుభకాలం. మానసికంగా దృఢంగా ఉండి, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.
తోటి వారి సహకారంతో సత్ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగంలో ఆటంకాలు రాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కలహాలకు దూరంగా ఉండాలి. ఇష్టదైవనామాన్ని జపిస్తే మేలైన ఫలితాలు వస్తాయి.
గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. కలహ సూచన ఉంది. గోసేవ చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు.
చక్కటి ఆలోచనా విధానంతో సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీకు లాభిస్తాయి. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి సహాయం చేసేవారున్నారు. లక్ష్మీగణపతి సందర్శనం మేలుచేస్తుంది.
ఉన్నతపదవి లాభాలున్నాయి. నూతన వస్తువులు కొంటారు. స్థిర నిర్ణయాలతో శుభం చేకూరుతుంది. వ్యాపారంలో తోటివారి సలహాలు మేలు చేస్తాయి. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ సందర్శనం ఉత్తమం
చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు తప్పవు. అధికారులు మెప్పించడానికి శ్రమ అధికమవుతుంది. ఒక వ్యవహారంలో అపకీర్తి వచ్చే ఆస్కారముంది. ఉత్సాహంతో ముందుకు సాగండి అంతా మంచే జరుగుతుంది. శ్రీ రామ సందర్శనం శుభప్రదం.
మిశ్రమకాలం. ధార్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. తోటివారి సహకారం ఉంటుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.
తలపెట్టిన పనులను తోటివారి సహకారంతో చక్కబెడతారు. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ధనధాన్యాది లాభాలున్నాయి. కలహాలు లేకుండా చూసుకోవాలి. దుర్గాదేవి సందర్శనం ఉత్తమం.