Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ రాశి ఫలాలు
Horoscope Today : ఈ రోజు(సెప్టెంబరు 18) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
రాశి ఫలాలు
By
Published : Sep 18, 2022, 6:33 AM IST
Horoscope Today : ఈ రోజు(సెప్టెంబరు 18) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
శుభకార్యాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన వ్యవహారంలో కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సాయం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సూర్యాష్టకం చదివితే మంచిది.
చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకుసాగండి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.
అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేయగలుగుతారు. ఒక శుభవార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. ప్రయత్నకార్యసిద్ధి ఉంది. ఒక ముఖ్యమైన వ్యవహరంలో పెద్దల సాయం అందుతుంది. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు పొందుతారు. ఇష్టదేవతా స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.
శుభకాలం. మంచి పనులు చేపడతారు. ఉద్యోగంలో శుభ ఫలితాలున్నాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యను పరిష్కరిస్తారు. శ్రీ మహాగణపతి ఆరాధన చేస్తే శుభదాయకం.
కార్యసిద్ధి ఉంది. తలపెట్టిన పనిలో ముందుచూపుతో వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. చక్కటి ఆలోచనా విధానంతో ముందుకు సాగి మంచి పేరు సంపాదిస్తారు. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలనిస్తుంది.
చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తర్వాత ఇబ్బందుల పాలవుతారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠిస్తే మంచిది.
మిశ్రమ వాతావరణం కలదు. కీలక వ్యవహారాల్లో ఆచి తూచి వ్యవహరించాలి. ఒక శుభవార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్యమైన వ్యవహరంలో ఆర్థిక సాయం లభిస్తుంది. లక్ష్మీ దేవి సందర్శనం శుభాన్నిస్తుంది.
మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉత్సాహవంతమైన వాతావరణం ఉంటుంది. ఇష్ట దేవతారాధన చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు.
మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.
మీ మీ రంగాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. ఆత్మవిశ్వాసం సడలకుండా జాగ్రత్తపడాలి. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు సూచితం. నిర్ణయాల్లో స్థిరత్వం ఉండదు. కలహాలకు దూరంగా ఉండాలి. శని శ్లోకం పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
మీ మీ రంగాల్లో విజయసిద్ధి ఉంది. ఒక విషయంలో మనః సంతోషాన్ని పొందుతారు. ఆర్థికంగా మేలు జరుగుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.