తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ రాశి ఫలాలు

Horoscope Today : ఈ రోజు(సెప్టెంబరు 16) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

HOROSCOPE TODAY
రాశి ఫలం

By

Published : Sep 16, 2022, 6:15 AM IST

Updated : Sep 16, 2022, 6:47 AM IST

Horoscope Today : ఈ రోజు(సెప్టెంబరు 16) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

వృత్తి, ఉద్యోగాల్లో జాగ్రత్త అవసరం. అనవసర కలహాలు సూచితం. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. తెలివిగా వ్యవహరించాలి. అనవసర ఖర్చులు వస్తాయి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

మంచి సమయం నడుస్తోంది. వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలున్నాయి. విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలనిస్తుంది.

చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి. ఆటంకాలు ఎదురైనా, వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం ఉత్తమం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. లక్ష్మీస్తుతి పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

అనుకూల ఫలితాలున్నాయి. ముఖ్యవిషయాల్లో ఆలస్యం చేయకండి. కొన్ని విషయాల్లో మనోనిబ్బరంతో ముందుకు సాగితే.. శుభం చేకూరుతుంది. ఆరోగ్యకరమైన పద్ధతులను అవలంబించడం మంచిది. గోసేవ చేయడం శుభప్రదం.

ధర్మసిద్ధి ఉంది. దైవబలంతో పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు శుభకాలం. బుద్ధి బలం బాగుంటుంది. బంధుమిత్రులను కలిసి సంతోషంగా ఉల్లాసంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచి ఫలితాలు సొంతమవుతాయి.

పనుల్లో జాప్యం జరగకుండా చూసుకోవాలి. కుటుంబ బాధ్యతలు అధికమవుతాయి. పరీక్షలా వాటిని ఎదుర్కోవలసి వస్తుంది. మీ అంచనాలు తప్పుతాయి. విలువైన వస్తువుల విషయంలో అజాగ్రత్త పనికి రాదు. ఆదిత్య హృదయం చదవడం మంచి ఫలితాలనిస్తుంది.

చేపట్టే పనుల్లో అలసట పెరగకుండా చూసుకోవాలి. చంచల బుద్ధి వల్ల ఇబ్బందులకు గురవుతారు. కీలక సందర్భాల్లో పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు అమృత గుళికల్లా పనిచేస్తాయి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలనిస్తుంది.

మంచి కాలం నడుస్తోంది. సత్కార్యాల కోసం సమయాన్ని వినియోగించండి. గొప్ప ఫలితాలను అందుకుంటారు. మీ ప్రతిభతో అసాధ్యాలు సుసాధ్యమవుతాయి. మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక శుభవార్త సంతోషాన్నిస్తుంది. ఆంజనేయస్వామి సందర్శనం శుభప్రదం.

భవిష్యత్ ప్రణాళికలను అమలు చేస్తారు. ఇష్టమైన వారితో కలసి కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆంజనేయ స్వామి సందర్శనం మంచి ఫలితాలనిస్తుంది.

మీమీ రంగాల్లో శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. అనవసర ఆలోచనలను దరిచేరనీయకండి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం.

తలపెట్టిన కార్యాల్లో ఆటంకాలు ఎదురైనా.. అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. గోసేవ శుభప్రదం.

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ప్రసన్నాంజనేయ సోత్ర పారాయణ చేస్తే మంచిది.

Last Updated : Sep 16, 2022, 6:47 AM IST

ABOUT THE AUTHOR

...view details