Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - రాశిఫలాలు
Horoscope Today : ఈ రోజు(సెప్టెంబరు 12) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
horoscope today
By
Published : Sep 12, 2022, 6:14 AM IST
Horoscope Today : ఈ రోజు(సెప్టెంబరు 12) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
తలపెట్టిన కార్యాలు ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. గోసేవ చేస్తే బాగుంటుంది.
చక్కటి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. లక్ష్మీదేవిని ఆరాధిస్తే శుభఫలితాలుంటాయి.
కీలక వ్యవహారాలలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయ సూచితం. బంధువులతో వాదనలకు దిగడం వలన విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇష్టదేవత స్తోత్ర పారాయణ చేస్తే మంచిది.
మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. సన్నిహితుల వల్ల మేలు జరుగుతుంది. ముఖ్య విషయాల్లో మీ మనస్సు చెప్పిన విధంగా నడుచుకోండి సత్ఫలితాలు సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచి ఫలితాలనిస్తుంది.
ధర్మసిద్ధి ఉంది. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. దైవారాదన మానవద్దు.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలున్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. ప్రసన్నాంజనేయ సోత్రం పారాయణ చేయాలి.
పనుల్లో జాప్యం జరగకుండా చూసుకోవాలి. కుటుంబ బాధ్యతలు అధికమవుతాయి. ఒక పరీక్షలా వాటిని ఎదురుకోవలసి వస్తుంది. మీ అంచనాలు తప్పుతాయి. విలువైన వస్తువుల విషయాలలో అజాగ్రత్త పనికి రాదు. ఆదిత్య హృదయం చదవడం మంచి ఫలితాలనిస్తుంది
భవిష్యత్ ప్రణాళికలను అమలుచేస్తారు. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. ఆంజనేయ స్వామి సందర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది
అదృష్ట ఫలాలు అందుతాయి. అధికారులు మీపై అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. వేంకటేశ్వర స్వామి వారి దర్శనం శుభప్రదం.
చేపట్టే పనుల్లో అలసట పెరగకుండా చూసుకోవాలి. అస్థిర బుద్ధి వల్ల ఇబ్బందులకు గురవుతారు. కీలక సందర్భాల్లో పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు అమృత గుళికల్లా పనిచేస్తాయి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది
అనుకున్న పనులు నెరవేరుతాయి. మనఃసౌఖ్యం ఉంటుంది. మీ పై అధికారుల సహకారం ఉంటుంది. అర్థలాభం ఉంది. ధర్మసిద్ధి కలదు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఇష్టదైవారాధన శుభప్రదం.