తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022) - గ్రహం అనుగ్రహం

Horoscope Today (08-08-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
horoscope

By

Published : Aug 8, 2022, 4:51 AM IST

Horoscope Today (08-08-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

చేపట్టేపనుల్లో శ్రమపెరుగుతుంది. ఎవ్వరితోను విభేదించకండి. మాట విలువను కాపాడుకోవాలి. సజ్జనులతో కాలాన్ని గడుపుతారు. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శ్రీ రామ నామస్మరణ మేలు చేస్తుంది.

శుభకాలం. మీ మీ రంగాల్లో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. శ్రమఫలిస్తుంది. స్థిర చిత్తంతో ముందుకు సాగితే సమస్యలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం మేలు చేస్తుంది

ముఖ్యవిషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు అవసరమవుతాయి. శత్రువుల జోలికి పోకుండా ఉండటం మంచిది. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గణపతి సందర్శనం శుభప్రదం.

ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. స్థిరమైన నిర్ణయాలతో మేలైన ఫలితాలు సాధిస్తారు. మానసిక ప్రశాంతతను కోల్పోకుండా ముందుకు సాగాలి. ఒత్తిడిని దరిచేరనీయకండి. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం శుభదాయకం

చేపట్టిన పనులను దైవానుగ్రహంతో వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. వేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. మనసు చెడ్డ పనులమీదకు మళ్లుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. తోటివారితో అభిప్రాయ బేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సూర్య ఆరాధన శుభప్రదం.

మధ్యమ ఫలాలున్నాయి. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా పఠించాలి.

చిత్త శుద్ధితో పనులను ప్రారంభిస్తారు. మీ పరిధిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి. అవసరానికి సహాయం చేసేవారుంటారు. అతిగా ఎవ్వరినీ నమ్మరాదు. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

మీ ప్రతిభకు పనితీరుకు అధికారులు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో అభిప్రాయబేదాలు రానీయకండి. బంధుమిత్రుల వల్ల ధనవ్యయం జరుగుతుంది. సుబ్రహ్మణ్య భుజంగస్తవం పఠించాలి.

కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. చేపట్టిన పనులను పూర్తిచేయడంలో కాస్త ఇబ్బందులు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. నారాయణ మంత్రాన్ని జపించాలి.

వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో శుభఫలితాలున్నాయి. కుటుంబ సహకారం ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేయగలుగుతారు. బంధుమిత్రులతో వాగ్వాదాలకు దిగవద్దు. దైవారాధన మానవద్దు.

బుద్ధిబలం బాగుంటుంది. ఒక శుభవార్త వింటారు. ఒక వ్యవహారంలో చంచలబుద్ధితో వ్యవహరించి ఇబ్బందులు పడతారు. అధికారులతో కొన్ని ముఖ్యవిషయాలలో అభిప్రాయ బేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దైవారాధన మానవద్దు.

ఇదీ చూడండి :రోడ్డుపై కూలిన సైన్​ బోర్డ్.. నాలుగు వాహనాలు ఢీ.. ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details