Horoscope Today (07-08-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..
ముఖ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి అడుగు లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు వేయండి. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఆరోగ్యం కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. ఇష్టదైవ స్తోత్రాలు చదివితే శుభఫలితాలు కలుగుతాయి.
మీ మీ రంగాల్లో శుభఫలితాలను అందుకుంటారు. ప్రయత్న బలాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.
విందు,వినోదాలతో కాలం గడుస్తుంది. చేపట్టిన పనులను ప్రణాళికతో పూర్తిచేయగలుగుతారు. కొన్ని సంఘటనలు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి. ఇష్టదైవ ఆలయ సందర్శనం మరింత శుభాన్ని చేకూరుస్తుంది.
ప్రయత్నకార్యానుకూలత ఉంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక వార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. ఈశ్వరారాధన సత్ఫలితాలను ఇస్తుంది.
శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. బంధు,మిత్రులను కలుస్తారు. ఆర్థికాంశాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
శుభాలు చేకూరుతాయి. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది.శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆదిత్య హృదయం చదవాలి.