HOROSCOPE TODAY: ఈరోజు మీ రాశిఫలం ఎలా ఉందంటే? - రాశి ఫలాలు తెలుగు
HOROSCOPE TODAY: ఈరోజు (అక్టోబర్ 30) మీ రాశిఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
రాశి ఫలాలు
By
Published : Oct 30, 2022, 6:19 AM IST
HOROSCOPE TODAY: ఈరోజు (అక్టోబర్ 30) మీ రాశిఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
శ్రమ అధికమవుతుంది. ఉద్యోగంలో అందరినీ కలుపుకుపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. ఆవేశాలకు పోకూడదు. ప్రయాణాల్లో అశ్రద్ధ వద్దు. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.
కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. స్థానచలనం సూచితం. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి. అకాల భోజనం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి. శివనామాన్ని జరిపించాలి.
ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. శనిధ్యానం శుభప్రదం.
గ్రహబలం అనుకూలంగా ఉంది. విజయావకాశాలు మెరుగవుతాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆర్థిక వ్యవహారాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదైవ నామస్మరణ మంచిది.
ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. విష్ణుసహస్రనామం చదవడం లేదా వినడం చేస్తే మంచిది.
మీ మీ రంగాల్లో తోటివారి సహాయ సహకారాలు అందుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది.
ఊహించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. శని శ్లోకాన్ని పఠిస్తే అన్నివిధాలా మంచిది.
చేపట్టిన పనులలో ఆటంకాలు పెరుగుతాయి. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. మీకు రావలసిన అవకాశాలు రాకపోవడం, పక్కవాళ్లకు రావడంతో కాస్త నిరుత్సాహం ఆవరిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. గోసేవ చేస్తే బాగుంటుంది.
మంచి ఫలితాలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అధికారులు ద్రుష్టిని మీరు ఆకర్షిస్తారు. ఒక వ్యవహారంలో మెరుగైన ఫలితాలను పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల ఫలిస్తాయి. హనుమత్ దర్శనం శ్రేయస్సునిస్తుంది.
చేపట్టే పనుల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని కీలకమైన ప్రణాళికలు వేస్తారు. వాటిని ప్రారంభించడంలో చిన్నచిన్న ఆటంకాలను ఎదుర్కొంటారు. కీలక వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.
శుభకాలం. అనుకున్న పనులు పూర్తవుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతోఆనందంగా గడుపుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.
చేపట్టే పనుల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. నూతన వస్తువులను కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. బంధువులతో కలహ సూచన. ప్రయాణాల్లో ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మీగణపతి ఆరాధనా శుభప్రదం.