HOROSCOPE TODAY: ఈరోజు మీ రాశిఫలం ఎలా ఉందంటే? - దిన ఫలాలు
HOROSCOPE TODAY: ఈరోజు (అక్టోబర్ 28) మీ రాశిఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
రాశి ఫలాలు
By
Published : Oct 28, 2022, 6:16 AM IST
HOROSCOPE TODAY: ఈరోజు (అక్టోబర్ 28) మీ రాశిఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
మిశ్రమ కాలం. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తిపడకపోవచ్చు. అస్థిర నిర్ణయాలతో సతమతమవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవాలి.
శుభకాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది.
తలపెట్టిన పనులు శీఘ్ర విజయాన్నిస్తాయి. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. అర్థలాభం ఉంది. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. లింగాష్టకం చదవాలి.
సమయానుకూలంగా ముందుకు సాగండి. పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధనలాభం సూచితం. మానసిక ప్రశాంతత కోసం లక్ష్మీదేవి సందర్శనం ఉత్తమం.
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అలసట పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు మేలు చేస్తాయి. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మహాలక్ష్మీ అష్టోత్తరం చదివితే మంచిది.
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సూర్యాష్టకం పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులు లేదా పెద్దలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. నవగ్రహ ఆరాధన శుభప్రదం.
శుభ ఫలితాలు సొంతమవుతాయి. కీలక కొనుగోలు వ్యవహారంలో మీకు లాభం చేకూరుతుంది. మీ రంగంలో మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. ఆంజనేయ స్వామి ఆరాధన శుభదాయకం.
మిశ్రమ వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులు సూచితం. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిపడతారు. శివపార్వతులను పూజించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు.
మనస్సౌఖ్యం కలదు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మంచినిస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి తగిన సహాయం చేసేవారున్నారు. విష్ణుసహస్రనామ పారాయణం చేయాలి.
బాధ్యతలు పెరుగుతాయి. మీ ఆలోచనా ధోరణికి, ముందుచూపుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. లలితా సహస్రనామ పారాయణ చేయాలి.
చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధుమిత్రులతో విబేధాలు రావచ్చు. దుర్గాదేవి శ్లోకం చదవాలి.