Horoscope Today: ఈ రోజు(అక్టోబర్ 25) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
రాశి ఫలాలు
By
Published : Oct 25, 2022, 6:19 AM IST
Horoscope Today: ఈ రోజు(అక్టోబర్ 25) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
సప్తమస్థానంలో నేడు పడుతున్న సూర్య గ్రహణం మధ్యమ ఫలాన్నిస్తోంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోధైర్యంతో విజయం సాధిస్తారు. అనవసరమైన ఆందోళన తగ్గించుకుంటే మంచిది. లలితా సహస్రనామం పఠించాలి.
షష్ఠ స్థానంలో నేడు పడుతున్న సూర్య గ్రహణం శుభ ఫలాన్నిస్తోంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదైవ స్తోత్రం పఠిస్తే మంచిది.
పంచమ స్థానంలో నేడు పడుతున్న సూర్య గ్రహణం మధ్యమ ఫలాన్నిస్తోంది. ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక వ్యవహారంలో మీ ఆలోచనలు అందరి ప్రశంసలను అందుకుంటాయి. అభిప్రాయబేధాలు వచ్చే సూచనలున్నాయి. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
చతుర్థ స్థానంలో నేడు పడుతున్న సూర్య గ్రహణం అధమ ఫలాన్నిస్తోంది. చేసే పనిలో శ్రమ పెరుగుతుంది. ఆశించిన ఫలితాలను రాబట్టడంలో ఫర్వాలేదనిపిస్తుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు రాకుండా చూసుకోవాలి. వేంకటేశ్వర స్వామి ఆరాధన శక్తినిస్తుంది.
తృతీయ స్థానంలో నేడు పడుతున్న సూర్య గ్రహణం శుభ ఫలితాన్నిస్తోంది. ఆర్థికంగా ఎదుగుతారు. సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగండి. అనుకూలత లభిస్తుంది. చక్కటి ప్రణాళికతో అనుకున్నది సాధిస్తారు. కీలక పనులను ఈ రోజు ప్రారంభించడం మంచిది. ఇష్టదైవం నామస్మరణ ఉత్తమం.
ద్వితీయ స్థానంలో నేడు పడుతున్న సూర్య గ్రహణం మధ్యమ ఫలాన్నిస్తోంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. ఆర్థిక విషయాల్లో తగిన జాగ్రత్తలు అవసరం. శివుడుని ఆరాధించాలి.
జన్మరాశిలో నేడు పడుతున్న సూర్య గ్రహణం అధమ ఫలాన్నిస్తోంది. శరీర పీడ ఉంటుంది. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. మంచి ఆలోచనలతో ముందుకు సాగితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రణాళిక లేకుండా పనులను పూర్తి చేయలేరు. సూర్య ధ్యానం శుభప్రదం.
వ్యయ స్థానంలో నేడు పడుతున్న సూర్య గ్రహణం అధమ ఫలాన్నిస్తోంది. దైవారాధనతో ఆత్మశక్తి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారంలో ముందు జాగ్రత్త అవసరం. తోటివారిని కలుపుకుపోవడం ద్వారా మంచి జరుగుతుంది. సూర్య చంద్ర కేతు ధ్యానాలు శుభానిస్తాయి.
లాభ స్థానంలో నేడు పడుతున్న సూర్య గ్రహణం శుభఫలాన్నిస్తోంది. మంచి ఫలితాలను పొందుతారు. ఏ పని తలపెట్టినా వెంటనే పూర్తవుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఒక వార్త శక్తినిస్తుంది. ఇష్టదైవ నామాన్ని పఠించాలి.
దశమ స్థానంలో నేడు పడుతున్న సూర్య గ్రహణం శుభఫలితాన్నిస్తోంది. శుభకాలం. ముఖ్యమైన పనులను ప్రారంభిస్తారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. శివ నామస్మరణ మంచిది.
నవమ స్థానంలో నేడు పడుతున్న సూర్యగ్రహణం మధ్యమ ఫలితాన్నిస్తుంది. తలపెట్టిన కార్యాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. పెద్దల ఆశీర్వచనంతో చేసే పనులు ఫలిస్తాయి. అనవసర విషయాల్లో తలదూర్చకండి. దుర్గా అష్టోత్తర శతనామావళి పఠించాలి.
అష్టమ స్థానంలో నేడు పడుతున్న సూర్య గ్రహణం అనుకూలించట్లేదు. కొందరి ప్రవర్తనతో మీకు కాస్త మనస్తాపం కలుగుతుంది. కొందరు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు. కీలక విషయాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది. శ్రీమన్నారాయణ నామస్మరణ శుభప్రదం.