తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందంటే? - శంకరమంచి శివసాయి శ్రీనివాస్ రాశి ఫలాలు

Horoscope Today: ఈ రోజు(అక్టోబర్​ 24) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

horoscope
రాశి ఫలాలు

By

Published : Oct 24, 2022, 6:21 AM IST

Horoscope Today: ఈ రోజు(అక్టోబర్​ 24) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

శుభకాలం. చిత్తశుద్ధితో విజయం సాధిస్తారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. అధికారుల మన్ననలను పొందుతారు. శివారాధన వల్ల మంచి జరుగుతుంది.

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. లక్ష్మీ సందర్శనం ఉత్తమం.

ప్రారంభించిన పనులలో ప్రగతిని సాధిస్తారు. బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఇష్టదైవారాధన శ్రేయెస్సునిస్తుంది.

మిశ్రమ ఫలితాలున్నాయి. అధికారులతో జాగ్రత్త. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చలు వస్తాయి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. శని జపం అనుకూలతనిస్తుంది.

శుభ కాలం. కీలక వ్యవహారాల్లో మేలైన ఫలితాలను పొందుతారు. అధికారుల సహకారం ఉంటుంది. స్థిరనిర్ణయాలతో అభివృద్ధిని సాధిస్తారు. ఇష్ట దేవత శ్లోకాలు చదువుకోవాలి.

ముఖ్య విషయాల్లో అనుకూలత ఉంది. కొన్ని వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. శివారాధన మంచిది.

చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. ఉత్సాహంగా ముందుకు సాగితే అనుకున్నది సొంతమవుతుంది. అనవసరంగా ఆందోళన పడటం తగ్గించుకుంటే మంచిది. శివపంచాక్షరీ స్తోత్రం పఠిస్తే మంచిది.

మిశ్రమ కాలం. మీ మీ రంగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. గిట్టని వారితో మిత భాషణం అవసరం. స్థాన చలనం సూచితం. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం.

పట్టుదల చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవాలి. బంధుమిత్రులను కలుపుకుపోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈశ్వరారాధన శుభప్రదం.

ప్రారంభించిన పనులను సులభంగా పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక వార్త ఉత్సాహాన్నిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. లక్ష్మీదేవి సందర్శనం ఉత్తమం.

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ధర్మసిద్ధి ఉంది. అష్టమ చంద్రస్థితి అనుకూలంగా లేదు. ముఖ్యవ్యవహారాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఇష్టదైవ సందర్శనం ఉత్తమం.

శ్రమ ఫలిస్తుంది. మొదలుపెట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేయగలుగుతారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం. ఇష్టదైవారాధన మంచిది.

ABOUT THE AUTHOR

...view details