Horoscope Today: ఈ రోజు(అక్టోబర్ 23) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
horoscope today
By
Published : Oct 23, 2022, 6:21 AM IST
Horoscope Today: ఈ రోజు(అక్టోబర్ 23) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆదిత్య హృదయం చదవాలి.
మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. ఈశ్వరనామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.
మనోధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వస్త్రలాభం ఉంది. ఆర్ధికంగా ఎదగడానికి పునాదులను నిర్మిస్తారు. విష్ణు నామాన్ని జపించండి.
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారంలో మీరు అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. ఆ గుర్తింపు మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.
మనఃస్సౌఖ్యం కలదు. సౌభాగ్య సిద్ధి ఉంది. నలుగురిలో గొప్పపేరు సంపాదిస్తారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. సమయాలు తగ్గుతాయి. శ్రీలక్ష్మీదర్శనం శుభప్రదం.
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. గణపతి స్తోత్రం చదవండి. మంచి జరుగుతుంది.
తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. అలసట కాస్త ఎక్కువగా ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.
కాలం అనుకూలిస్తోంది. ప్రారంభించిన పనులను నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. బంధు,మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి నిర్ణయాలతో మేలైన ఫలితాలను అందుకుంటారు. ఇష్టదైవ ప్రార్థన శుభకరం.
మీ మీ రంగాలలో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.
ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.
ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. లక్ష్మీస్తుతి చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
తోటి వారి సహకారంతో సత్ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగంలో ఆటంకాలు రాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కలహాలకు దూరంగా ఉండాలి. ఇష్టదైవం నామాన్ని జపిస్తే మేలైన ఫలితాలు వస్తాయి.