తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందంటే? - నేటి రాశిఫలాలు

Horoscope Today: ఈ రోజు(అక్టోబర్​ 22) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

horoscope today
horoscope today

By

Published : Oct 22, 2022, 6:07 AM IST

Horoscope Today: ఈ రోజు(అక్టోబర్​ 22) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

మంచి మనస్సుతో చేసే పనులు త్వరగా సిద్ధిస్తాయి. మానసికప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. అష్టమంలో చంద్ర దోషం ఉంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

బంధు,మిత్రుల సహకారంతో వాటిని కొన్ని ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల ప్రశంసలు లభిస్తాయి. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.

శుభప్రదమైన కాలం నడుస్తోంది. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. ఇష్టదేవతారాధన శుభకరం.

చేపట్టే పనిలో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. తోటివారిని కలుపుకొనిపోవడం ఉత్తమం. మానసిక అశాంతి ఉంటుంది. ఎలాంటి పరిస్థితిలోనైనా మనోధైర్యాన్ని వదలకండి. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం.

అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులలో ఒకట్రెండు ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. శివారాధన మంచిది.

మిశ్రమకాలం. సొంత నిర్ణయాలు పనిచేయవు. మంచి ఆలోచనావిధానంతో ముందుకు సాగండి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే మంచిది. ప్రయత్నలోపం లేకుండా చూసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోను నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకండి. ఈశ్వర ధ్యానం శుభప్రదం.

అనుకున్నది సాధిస్తారు.బంధుప్రీతి ఉంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి. గొప్పవారితో సత్సాంగత్యం కలుగుతుంది. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

సకాలంలో పనులను పూర్తిచేస్తారు. బంధు,మిత్రులను కలుపుకొనిపోతారు. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. ప్రయాణాలు సుఖవంతం అవుతాయి.శివుడిని ఆరాధిస్తే మంచిది.

లక్ష్యాలను చేరుకోవాలంటే బాగా కృషి చేయాలి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు తలెత్తకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. శత్రువులకు దూరంగా ఉండాలి. దుర్గాధ్యానం శుభప్రదం.

అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.

మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబసభ్యులతో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. వ్యాపారంలో ధనలాభం ఉంది. శ్రీలక్ష్మీ నామస్మరణ మంచిది.

లక్ష్యం నెరవేరుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. మానసికంగా దృఢంగా ఉండాలి. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. శ్రమ అధికం అవుతుంది. దుర్గా ఆరాధన శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details