తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందంటే? - రాశిఫలాలు

Horoscope Today: ఈ రోజు(అక్టోబర్​ 20) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

horoscope today
horoscope today

By

Published : Oct 20, 2022, 6:04 AM IST

Horoscope Today: ఈ రోజు(అక్టోబర్​ 20) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

నమ్మకంతో పనిచేస్తే తప్పక విజయం సిద్ధిస్తుంది. చేసే పనిలో తడబాటు రానీయకండి. మనోధైర్యంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. కలహసూచన ఉంది. ఆవేశపూరిత నిర్ణయాలు వద్దు. దుర్గా అష్టోత్తర శతనామావళి చదివితే మంచిది.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. మీ పనితీరు, ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. మనఃశ్శాంతి లభిస్తుంది. దుర్గాశ్లోకం చదవండి.

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది.

కీలక వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. తోటివారి సహకారం ఉంటుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

చేపట్టిన పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి ప్రశంసలను పొందుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. విష్ణు నామస్మరణ ఉత్తమ ఫలాలను ఇస్తుంది.

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. బంధు,మిత్రులను కలుపుకొని పోవడం వల్ల సమస్యలను అధిగమించగలుగుతారు. సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్లడం మంచిది. అనవసరమైన ఆందోళన తగ్గించుకుంటే మంచిది. దుర్గాస్తోత్రం చదవాలి.

శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మీ మీ రంగాల్లో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శివనామస్మరణ చేస్తే మేలు.

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. వాదప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అపమృత్యుభయం వల్ల మనఃశ్శాంతి తగ్గుతుంది. శనిశ్లోకం చదవాలి.

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీరు ఊహించిన దాని కన్నా అధిక ధనలాభం పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన పనులలో ముందడుగు పడుతుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. శివారాధన మేలు చేస్తుంది.

పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇష్టదైవ స్తోత్రాన్ని చదవడం మంచిది.

అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details