Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - రాశుల వారీగా రాశి ఫలాలు
Horoscope Today: ఈ రోజు(అక్టోబర్ 17) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
రాశి ఫలాలు
By
Published : Oct 17, 2022, 6:27 AM IST
Horoscope Today: ఈ రోజు(అక్టోబర్ 17) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. అభివృద్ధికి సంబంధించిన పనుల్లో ముందంజ వేయగలుగుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.
మొదలుపెట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలకమైన పనులను కొన్నాళ్లు వాయిదా వేయడమే మంచిది. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. దుర్గరాధన శుభప్రదం.
లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తారు. ధర్మ సందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనో విచారం కలగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.
శుభకాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం పఠించాలి.
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తుంది. మహాలక్ష్మీ అష్టోత్తరం చదివితే మంచిది.
కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకట్రెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది చేయవు. ప్రయాణాల్లో జాగ్రత్త. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
మధ్యమ ఫలితాలున్నాయి. పనులకు ఆటంకం కలుగకుండా ముందుజాగ్రత్తతో వ్యవహరించాలి. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతమవుతాయి. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు. దుర్గారాధన శుభప్రదం.
ధర్మసిద్ధి ఉంది. బాగా కష్టపడి పనిచేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. బంధుల అండదండలుంటాయి. హనుమత్ ఆరాధన శుభప్రదం.
మొదలు పెట్టిన పనుల్లో ఒకట్రెండు ఆటంకాలు ఎదురైనా పోరాడి విజయం సాధిస్తారు. పట్టుదల వదలకండి. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటుంది. దైవారాధన మానవద్దు.
ఒక ముఖ్యమైన పనిని పూర్తిచేయగలుగుతారు. మీ శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయి. మీ పరిధిని దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. తోటివారికి సహాయం చేయాలనే ఆలోచన మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. దత్తాత్రేయ సందర్శనం శుభప్రదం.
మనోధైర్యంతో చేసే పనులు మంచినిస్తాయి. ఒక కీలక విషయంలో మీ ఆలోచనా ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభ కాలం. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దుర్గ దేవి సందర్శనం శుభప్రదం.
శ్రమతో కూడిన ఫలాలున్నాయి. కీలక వ్యవహారాలలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. సూర్య స్తోత్రం చదివితే మంచిది.