తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందో చూసుకున్నారా? - నేటి రాశిఫలాలు

Horoscope Today: ఈ రోజు(అక్టోబర్​ 13) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

horoscope today
horoscope today

By

Published : Oct 13, 2022, 6:10 AM IST

Updated : Oct 13, 2022, 6:19 AM IST

Horoscope Today: ఈ రోజు(అక్టోబర్​ 13) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

ఉద్యోగంలో శ్రద్దగా పనిచేయాలి. ఆరోగ్య నియమాలను పాటించాలి. కలహాలకు దూరంగా ఉండాలి. వేంకటేశ్వరస్వామి ఆరాధన శుభాన్నిస్తుంది.

మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అందరినీ కలుపుకొని పోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

తలపెట్టిన కార్యాల్లో శ్రమపెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కలహాలకు తావివ్వకండి. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం మేలు చేస్తుంది.

చేపట్టే పనిలో ఆటంకాలు అధికమవుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అదిగమిస్తారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కనకధారాస్తవం పఠించాలి.

అదృష్ట కాలం. బుద్ధిబలంతో పనులను పూర్తిచేస్తారు. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది.

మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. అపోహలతో కాలాన్ని వృథా చేయకండి. ఈశ్వరదర్శనం చేయడం మంచిది.

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోబలంతో ముందుకు సాగాలి. ఒక వార్త మనస్తాపానికి గురిచేస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. శివారాధన చేయాలి.

దైవ బలం కలదు. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఒక వ్యవహారంలో నైతిక విజయం సాధిస్తారు. ఆర్థికంగా మేలైన ఫలితాలున్నాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ ఆరాధన మరింత శుభాన్నిస్తుంది.

చేపట్టిన పనులను మనోధైర్యంతో పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆత్మీయులతో వాగ్వాదాలకు పోరాదు. భయాందోళనలను విడనాడాలి. చెడ్డవాళ్లతో సావాసం చేయడం వలన కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. దుర్గాస్తుతి పఠించాలి.

ప్రయత్న కార్యసిద్ధి కలదు. కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు. మాటపట్టింపులు పోరాదు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. లక్ష్మీదేవి ఆరాధన శ్రేయోదాయకం.

ఉత్సాహంగా పనిచేసి చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. అనవసర ప్రయాణాల వల్ల సమయం వృథా అవుతుంది. బంధుమిత్రులతో ఆచి తూచి వ్యవహరించాలి. కలహాలకు తావివ్వరాదు. సుబ్రహ్మణ్య ఆరాధనా మేలు చేస్తుంది.

ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. తరుచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

Last Updated : Oct 13, 2022, 6:19 AM IST

ABOUT THE AUTHOR

...view details