Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - ఈ రోజు మీ రాశి ఫలం
Horoscope Today: ఈ రోజు(అక్టోబర్ 8) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
horoscope
By
Published : Oct 8, 2022, 6:12 AM IST
Horoscope Today: ఈ రోజు(అక్టోబర్ 8) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్య కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. సౌభాగ్యసిద్ధి ఉంది. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.
మనోధైర్యంతో ప్రయత్నించి అనుకున్న కార్యక్రమాలను సాధిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. బంధు,మిత్రులను కలుస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. చంద్రశేఖరాష్టకాన్ని చదివితే మంచిది.
మంచి సమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.
ఆశించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. నవగ్రహ ధ్యాన శ్లోకాన్ని చదవడం అన్నివిధాలా మంచిది.
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. విష్ణు నామస్మరణ మంచిది.
చేపట్టే పనుల్లో విజయం చేకూరుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు సంతోషాన్ని కలిగిస్తాయి. దైవారాధన మానవద్దు.
ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగండి. అన్నీ మంచి ఫలితాలే పొందుతారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. గణపతిని ఆరాధించడం మంచిది.
శరీరసౌఖ్యం కలదు. భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. తోటివారితో ఆనందంగా గడుపుతారు. కాలం అనుకూలంగా ఉంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.
చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధు,మిత్రులతో విబేధాలు రావచ్చు. చంద్ర శ్లోకం చదవాలి.