Horoscope Today: ఈ రోజు(అక్టోబర్ 2) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
Horoscope Today
By
Published : Oct 2, 2022, 8:12 AM IST
Horoscope Today: ఈ రోజు(అక్టోబర్ 2) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. శనిధ్యానం శుభప్రదం.
చేపట్టే పనులలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తిపడక పోవచ్చును. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. దైవారాధనను ఎట్టి పరిస్థితులలోనూ మానవద్దు.
శుభకాలం. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి. శివనామాన్ని జరిపించాలి.
శుభకాలం. ఇష్టలతో కాలాన్ని గడుపుతారు. ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించడం మంచిది.
ఊహించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమచేయాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. శని శ్లోకాన్ని పఠిస్తే అన్నివిధాలా మంచిది
వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయరాదు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.
శ్రమ అధికమవుతుంది. అందరినీ కలుపుకుపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. ఆవేశాలకు పోకూడదు. ప్రయాణాల్లో అశ్రద్ధ వద్దు. పనులయందు విజయం కోసమై గోవింద నామాలు చదివితే మంచి జరుగుతుంది.
ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి మొదలుపెట్టాలి. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.
విజయావకాశాలు మెరుగవుతాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆర్థిక వ్యవహారాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదైవ నామస్మరణ మంచిది.
మిశ్రమ ఫలితాలున్నాయి. ముఖ్య విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయ సూచితం. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.
చేప్పట్టే పనుల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు. మనః సంతోషాన్ని పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.
పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.