Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - ఈ రోజు రాశి ఫలం
Horoscope Today: ఈ రోజు(అక్టోబర్ 1) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
horoscope for today
By
Published : Oct 1, 2022, 6:30 AM IST
Horoscope Today: ఈ రోజు(అక్టోబర్ 1) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. మొదలుపెట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేయగలుగుతారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం. ఇష్టదైవారాధన మంచిది.
సమయానుకూలంగా ముందుకు సాగండి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. లక్ష్మీ సందర్శనం ఉత్తమం.
శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు.
ప్రారంభించిన పనులలో చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఇష్టదైవారాధన శ్రేయెస్సునిస్తుంది.
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఇష్టదైవ సందర్శనం ఉత్తమం.
చిత్తశుద్ధితో విజయం సాధిస్తారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబసభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్తపడాలి. అధికారుల కోపానికి గురికాకుండా, ఓర్పుగా వ్యవహరించండి. శివారాధన వల్ల మంచి జరుగుతుంది.
మిశ్రమ కాలం. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తిపడక పోవచ్చును. అస్థిరనిర్ణయాలతో సతమతమవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవాలి.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. అంతటా శుభమే గోచరిస్తోంది. ఈశ్వరారాధన మంచిది.
ఉద్యోగంలో అధికారులు మీకు అనుకూలమైన, మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. నూతన వస్తువులు కొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం శుభప్రదం.
ఉద్యోగంలో శుభఫలితాలున్నాయి. శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అధికారుల సహకారం ఉంది. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. విష్ణు నామస్మరణ శక్తినిస్తుంది
మీ మీ రంగాల్లో అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికారులను మెప్పించడానికి కాస్త ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. శివ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందగలరు.
ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి. కార్యసిద్ధి ఉంది. ఆర్థికంగా ఆచితూచి వ్యవహరించాలి. దుర్గాధ్యానం శుభప్రదం.