HOROSCOPE TODAY:
మేషం: ప్రారంభించబోయే పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇష్టమైన వారితో గడుపుతారు. కీలకమైన వ్యవహారాలు దైవబలంతో పూర్తవుతాయి.చంచలబుద్ధి వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. దుర్గారాధన శుభప్రదం.
వృషభం: వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది.ప్రణాళికాబద్ధంగా వెళ్లకపోవడం వలన కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
మిథునం: మిశ్రమకాలం. ఇబ్బందిపెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి.దుర్గాదేవిని ఆరాధించాలి.
కర్కాటకం: మీ మీ రంగాల్లో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలను అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఈశ్వరాభిషేకం శుభకరం.
సింహం: ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. బుద్ధిబలం బాగుండటం వల్ల కొన్ని కీలక వ్యవహారాలలో నుంచి బయటపడగలుగుతారు. శివ నామస్మరణ శుభప్రదం.
కన్య: ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. వ్యాపారంలో అనుకూలఫలితాలు ఉన్నాయి. చిత్తసౌఖ్యం ఉంది. ఇష్టదైవం స్తుతి శుభప్రదం.
తుల: మిశ్రమ వాతావరణం ఉంటుంది. మీ మీ రంగాల్లో జాగ్రత్తగా మెలగాలి. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. శాంతంగా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. సూర్య ఆరాధన చేస్తే మంచిది.
వృశ్చికం: గొప్ప ఫలితాలను సాధిస్తారు. సుఖ సౌఖ్యాలు కలవు. ఒక వార్త మనోధైర్యాన్నిపెంచుతుంది. సుఖసంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు . శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం.
ధనుస్సు: మంచి ఫలితాలను పొందగలరు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం చదవడం శుభప్రదం.
మకరం: వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. పట్టుదల వదలకండి. కలహ సూచన. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.
కుంభం: అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్ధికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులను కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. లక్ష్మీగణపతి ఆరాధన శుభప్రదం.
మీనం: ముఖ్య కార్యక్రమాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఆపదలు కలుగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ మంచిది.