Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ? - రాశి ఫలాలు తెలుగు
Horoscope Today: ఈ రోజు(నవంబర్ 27) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
రాశి ఫలాలు
By
Published : Nov 27, 2022, 6:18 AM IST
|
Updated : Nov 27, 2022, 9:38 AM IST
Horoscope Today: ఈ రోజు(నవంబర్ 27) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
మిశ్రమకాలం. లక్ష్యాలను సాధించే క్రమంలో ఒత్తిడిని జయించాలి. ఇన్నాళ్లు మీకు అనుకూలంగా ఉన్నవాళ్లు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. ముఖ్య విషయాల్లో ముందుగా స్పందించండి. గణపతి సహస్రనామ పారాయణ శుభప్రదం.
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. నూతన కార్యక్రమాలను కుటుంబ సభ్యుల అంగీకారం తర్వాతే ప్రారంభించండి. కుటుంబానికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. శత్రువులకు దూరంగా ఉండాలి. ఇష్టదేవతా ధ్యానం మంచిఫలాలను ఇస్తుంది.
కార్యసిద్ధి ఉంది. దైవబలంతో ఒక పనిని పూర్తిచేస్తారు. ప్రారంభించిన పనులను ఉత్సాహంగా పూర్తిచేస్తారు. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. క్షమాగుణంతో ఉంటే మేలు జరుగుతుంది. లక్ష్మీదేవి దర్శనం శుభప్రదం.
ఎంత శ్రమిస్తారో అంత ఫలితాన్నిసాధిస్తారు. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. శివారాధన శుభప్రదం.
కాలం శుభప్రదంగా గడుస్తుంది. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. మనఃసౌఖ్యం ఉంటుంది. ఈశ్వరరాధన మంచిది.
ప్రారంభించిన పనిలో సంతృప్తికరమైన ఫలితాలను సాధిస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. లింగాష్టకం చదివితే మంచిది.
దైవబలం విశేషంగా రక్షిస్తోంది. ఆర్ధికంగా అనుకూలమైన సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవారాధన శుభదాయకం.
ఒక శుభవార్త వింటారు. ఆర్ధికంగా లాభదాయకమైన కాలం. అధికారుల సహకారం లభిస్తుంది.వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో పరిస్థితులు తారుమారు కాకుండా ముందు జాగ్రత్త పడటం మంచిది. అష్టలక్ష్మిదేవి సందర్శనం శుభప్రదం.
ప్రారంభించబోయే పనులలో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం శుభప్రదం.
మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. గొప్ప ఆలోచనా విధానంతో అభివృద్ధి సాధిస్తారు. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి.
గ్రహబలం తక్కువగా ఉంది. చేపట్టే పనుల్లో జాగ్రత్త అవసరం. పక్కాప్రణాళికతో సత్ఫలితాలు వస్తాయి. సమయానుకూలంగా నిర్ణయాలను మార్చుకుంటూ ముందుకు సాగాలి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
అనుకున్నది దక్కుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బుద్ధిబలం బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఇష్టదేవతాస్తుతి శుభకరం.