తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ? - నవంబర్​ రాశిఫలాలు

Horoscope Today: ఈ రోజు(నవంబర్​​ 26) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

horoscope-today-november-26-saturday
horoscope-today-november-26-saturday

By

Published : Nov 26, 2022, 6:23 AM IST

Horoscope Today: ఈ రోజు(నవంబర్​​ 26) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. మనోబలం సర్వప్రధానం. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఎవరితోనూ వాదోపవాదాలు వద్దు. మృదు సంభాషణ మేలు చేస్తుంది. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. సకాలంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఆర్థికఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. గణపతి ధ్యానం మంచిది.

మంచి సమయం. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. బంధు ప్రీతి కలదు. ఇష్టదైవనామస్మరణ ఉత్తమం.

ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. విందు,వినోదాల్లో పాల్గొంటారు. మీ పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. అపరిచితులను అతిగా నమ్మకండి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలంతో వ్యవహరించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. శివ సందర్శనం శుభప్రదం.

ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్నికలిగిస్తాయి. దైవారాధన మానవద్దు.

అదృష్టవంతులు అవుతారు. వృత్తి, ఉద్యోగ,వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా సానుకూల పరిస్థితులు ఉన్నాయి. నూతన వస్తువులను కొంటారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. శ్రీవిష్ణు అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.

అభివృద్ధిని ఇచ్చే అంశాల్లో స్పష్టత అవసరం. సంకల్పసిద్ధి ఉంది. వ్యయం పెరగకుండా జాగ్రత్త పడాలి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. ప్రశాంతమైన వాతావరణం కలదు. ఆంజనేయ సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. చిత్తశుద్ధితో పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. శివ అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.

తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలను రచిస్తారు. అనవసర ఖర్చులు జరగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

తోటివారి సహకారం ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సూర్య ఆరాధన శుభప్రదం.

ప్రారంభించిన పనిలో విజయం సిద్ధిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకండి. శివధ్యానం శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details