Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - రాశి ఫలాలు తెలుగు
Horoscope Today: ఈ రోజు(నవంబర్ 22) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
రాశిఫలాలు
By
Published : Nov 22, 2022, 6:15 AM IST
Horoscope Today: ఈ రోజు(నవంబర్ 22) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను పొందుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు పొందుతారు.ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన శుభప్రదం.
మీ మీ రంగాల్లో శుభప్రదమైన వాతావరణం ఉంటుంది. ధర్మసిద్ధి కలదు. మీ అభివృద్ధికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేసే సంఘటనలు చోటుచేసుకుంటాయి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది.
అవసరానికి ఆదుకునేవారు ఉన్నారు. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సంతోషాన్ని పంచుకుంటారు. ఇష్టదైవారాధన శుభప్రదం.
మనోబలంతో ముందుకు సాగి విశేషమైన ఫలితాలను సాధిస్తారు. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్నిపెంచుతుంది. శ్రీఆంజనేయస్వామి ఆరాధన శుభప్రదం.
ప్రారంభించబోయే పనుల్లో సులువైన మార్గాన్ని కనుగొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధురక్షణాలను గడుపుతారు. బద్ధకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ దరిచేరనీయకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.
మిశ్రమఫలితాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇబ్బందిపెట్టేవారు ఉన్నారు. చంచల బుద్ధితో ఇబ్బంది పడతారు. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.
ముఖ్య విషయాల్లో పెద్దల సహకారం తీసుకోవడం ఉత్తమం. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసర భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. శని ధ్యానం శుభప్రదం.
మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఒక తీపివార్త వింటారు. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. ఇష్టదైవ ప్రార్థన చేయడం ద్వారా మరింత శుభఫలితాలు పొందుతారు.
కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. స్థానచలనం సూచితం. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి. శివనామాన్ని జపించాలి.
నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.
ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. ప్రశాంతమైన చిత్తంతో ముందుకు సాగండి, మంచి జరుగుతుంది. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే మంచిది.
ఆత్మస్థైర్యంతో అనుకున్నది సాధిస్తారు. మీ పై అధికారులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి. అష్టమ చంద్ర సంచారం అనుకూలించట్లేదు. విరోధాలకు దూరంగా ఉండాలి. మనఃశ్శాంతి లోపించకుండా చూసుకోవాలి. శివారాధన శుభప్రదం.