తెలంగాణ

telangana

ETV Bharat / bharat

HOROSCOPE TODAY: ఈరోజు మీ రాశిఫలం ఎలా ఉందంటే? - రాశిఫలాల న్యూస్​

HOROSCOPE TODAY: ఈరోజు (నవంబరు 2) మీ రాశిఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

horoscope-today-november-2-wednesday
horoscope

By

Published : Nov 2, 2022, 6:29 AM IST

HOROSCOPE TODAY: ఈరోజు (నవంబరు 2) మీ రాశిఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

కీలక నిర్ణయాలను అమలు చేసే ముందు బాగా అలోచించి ముందు సాగాలి. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. శ్రీలక్ష్మీగణపతి సందర్శనం శక్తిని ఇస్తుంది.

ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కొన్ని సంఘటనలు మానసిక ఉత్సాహాన్ని ఇస్తాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దేహసౌఖ్యం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా చదవడం శుభకరం.

బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. శివ అష్టోత్తరం చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

ఒక శుభవార్త వింటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహకారం ఉంటుంది. ఆర్ధిక విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. గణపతి అష్టోత్తరం చదివితే శుభఫలితాలు కలుగుతాయి.

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికం అవుతుంది. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది.

భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ ప్రతిభ,పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. శ్రీలక్ష్మీ ఆరాధన శుభప్రదం.

ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఒక వార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

బంధు,మిత్రులను సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ధనవ్యయం సూచితం. నవగ్రహ ధ్యానశ్లోకాలు చదవండి.

అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన ఆత్మశక్తిని పెంచుతుంది. దుర్గాధ్యానం శుభప్రదం.

విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి,ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. చంద్రధ్యానం చదివితే ఇంకా బాగుంటుంది.

మంచికాలం. ఆర్థికంగా విజయం సాధిస్తారు. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. రాజదర్శన సల్లాపాలు, భోజన సౌఖ్యం లభిస్తాయి. శివాష్టకం చదివితే మంచి జరుగుతుంది.

ABOUT THE AUTHOR

...view details