తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం చూసుకున్నారా? - శుక్రవారం రాశిఫలాలు

Horoscope Today: ఈ రోజు(నవంబర్​​18) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

horoscope today
రాశిఫలాలు

By

Published : Nov 18, 2022, 6:15 AM IST

Updated : Nov 18, 2022, 10:05 AM IST

Horoscope Today: ఈ రోజు(నవంబర్​​18) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. కీలక విషయాల్లో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి. శివపార్వతులను పూజించడం మంచిది.

నూతన బాధ్యతలు చేపడతారు. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. లలితా సహస్రనామ పారాయణ చేయాలి.

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. కలహాలకు తావివ్వకండి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీవేంకటేశ్వర శరణాగతి స్తోత్రం చదవడం శుభకరం.

శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. కార్యసిద్ధి ఉంది. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో దేహజాఢ్యాన్ని రానీయకండి. దుర్గారాధన మేలు చేస్తుంది.

శుభకాలం. మానసికంగా దృఢంగా ఉండి, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. బంధు,మిత్రులతో కొన్ని వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.

మనఃస్సౌఖ్యం ఉంది. ఉద్యోగులకు శుభకాలం.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీఆంజనేయ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

శుభఫలితాలు సొంతం అవుతాయి. కీలకమైన కొనుగోలు వ్యవహారంలో లాభం చేకూరుతుంది. మీ రంగంలో మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. శ్రీఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

ఆశించిన ఫలితాలను రాబట్టడానికి ఎక్కువగా శ్రమించాలి. తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి.అనవసర విషయాల్లో తలదూర్చకండి. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.

శుభకాలం. మానసికంగా దృఢంగా ఉంటారు. మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. బంధుజన ప్రీతి ఉంది. అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు.అలసట పెరుగుతుంది. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. శివుడిని ఆరాధిస్తే మంచిది.

ప్రారంభించిన పనులలో ఆటంకాల ఎదురైనా అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం శుభప్రదం.

ఆత్మబలంతో ముందుకు సాగి విజయం సాధిస్తారు. ధనధాన్యాభివృద్ధి కలదు. మాట పట్టింపులకు పోకండి. మొహమాటం వల్ల లేనిపోని సమస్యలను కొనితెచ్చుకోకండి. ఎవరినీ అతిగా నమ్మకండి. విష్ణుసహస్రనామ స్తోత్రం చదివితే మంచిది.

Last Updated : Nov 18, 2022, 10:05 AM IST

ABOUT THE AUTHOR

...view details