తెలంగాణ

telangana

ETV Bharat / bharat

HOROSCOPE TODAY: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - ఈరోజు జాతకం

HOROSCOPE TODAY: ఈరోజు (నవంబర్ 12) మీ రాశిఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

horoscope today november 12 saturday
horoscope today november 12 saturday

By

Published : Nov 12, 2022, 6:23 AM IST

HOROSCOPE TODAY: ఈరోజు (నవంబర్ 12) మీ రాశిఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

కీలక నిర్ణయాలను అమలుచేసే ముందు బాగా అలోచించి ముందుకు సాగాలి. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. శ్రీలక్ష్మీ గణపతి సందర్శనం శక్తిని ఇస్తుంది.

ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కొన్ని సంఘటనలు మానసిక ఉత్సాహాన్ని ఇస్తాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దేహసౌఖ్యం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. శివ అష్టోత్తరం చదివితే మరిన్ని శుభఫలితాలు కలుగుతాయి.

వృత్తి,ఉద్యోగాల్లో అనుకూలత కలదు. కుటుంబ సహకారం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ పనితీరుకు ప్రశంసలు అందుతాయి. అందరినీ కలుపుకొనిపోవడం ఉత్తమం. దుర్గారాధన మేలు చేస్తుంది.

కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా చదవడం శుభకరం.

అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తిచేయగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన ఆత్మశక్తిని పెంచుతుంది. దుర్గాధ్యానం శుభప్రదం.

ప్రారంభించిన పనుల్లో జాప్యం వద్దు. వృత్తి,ఉద్యోగ రంగాలలో మీ పైవారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారంలో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి. మన పక్కనే ఉండి ఇబ్బందిపెట్టేవారు ఉన్నారు. నవగ్రహ ధ్యాన శ్లోకం చదవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

మీ ప్రతిభతో పెద్దలను మెప్పిస్తారు. బంధు,మిత్రులను కలుపుకొని పోవడం వలన సమస్యలను అధిగమించగలుగుతారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అనవసరంగా ఆందోళన పడటం తగ్గించుకుంటే మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్త. ఈశ్వరుణ్ణి పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.

మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం చదవడం శుభకరం.

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయాన్ని వృథా చేయకండి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. అనవసర ధనవ్యయం సూచితం. శారీరక శ్రమ పెరుగుతుంది. పంచముఖ ఆంజనేయ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

మిశ్రమ వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిపడతారు. శని ఆరాధన శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details