Horoscope Today : ఈ రోజు(మార్చి 7) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
Horoscope Today
By
Published : Mar 7, 2023, 6:14 AM IST
Horoscope Today : ఈ రోజు(మార్చి 7) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
మీ పిల్లలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అసంపూర్తిగా ఉన్న పనులన్నీ ఈరోజు పూర్తి చేస్తారు. మీరు ప్రభుత్వ లేదా వైద్య రంగంలో పనిచేస్తున్నట్టైతే ఈ రోజు చాలా అదృష్టమైన రోజు.
ఈ రోజు చాలా సృజనాత్మకమైన, సాఫల్యకరమైన రోజు. మీరు శ్రమించే తీరు ఇతరులను ఆకట్టుకొని వారిలో స్ఫూర్తి నింపుతుంది. దీంతో మీ తోటి ఉద్యోగులు ఉత్తేజితులవుతారు. మీ నేతృత్వంలో పనిచేసేందుకు సిద్ధమవుతారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో వారు మీకు సాయపడతారు. ఈ రోజు మీకు అత్యంత ఫలదాయకమైన రోజు. మీరు చేస్తున్న పనులు చక్కని పురోగతిని సాధిస్తాయి.
కొందరు ప్రత్యేకమైన వ్యక్తులతో భావోద్వేగపరమైన అనుబంధం ఏర్పడుతుంది. ఈ కారణంతో రోజంతా మీరు పారవశ్యంలో మునిగి తేలుతారు. తర్వాత ఒత్తిడికి కారణమయ్యే అంశాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ప్రశాంతమైన మనస్సుతో ఉంటే రోజు హాయిగా గడిచిపోతుంది.
పనికి సంబంధించినంత వరకు ఈ రోజు చాలా క్లిష్టమైన రోజు. ఎక్కడో దారితప్పిపోయినట్టుగా అనిపిస్తుంది. హృదయానికి భారంగా ఉంటుంది. పిల్లలతో ఉన్నవాళ్లు రిక్తహస్తాలతో తల్లడిల్లుతారు.
మీ సమర్థతను మీరు నమ్మితే ప్రతిదీ సరిగ్గా ఉంటుంది. ఈ రోజు మీరు అలాంటి దృఢనమ్మకాన్ని మీ కార్యకలాపాల్లో చూపితే అదే జరుగుతుంది. దృఢసంకల్పం, ప్రశాంత మనస్సుతో మీరు అత్యంత కఠినమైన పనులను కూడా చక్కదిద్దగలుగుతారు.
మొండితనం.. ఉద్రేకపడే స్వభావం కలిగి ఉండటం ఎవరికి మంచిది కాదు. ఈ సలహా ఎందుకంటారా..? ఈ రోజంతా మీరు అనేక అప్రియ ఘటనలు, సమస్యలను ఎదుర్కొబోతున్నారు. అవి మీలో దూకుడును పెంచుతాయి. మీరు ఆత్మవిశ్వాసంతో ఉండటం మంచిది. కాని గర్వపడితే సమస్యలు తీవ్రరూపం దాల్చుతాయి. అవి మీ అత్యంత ప్రియ మిత్రులను కూడా దూరం చేస్తాయి
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వివిధ రంగాల్లో విజయాలతో పాటు మీ ఆదాయంలోనూ పెరుగుదల కనిపిస్తుంది. ఇది మీలో సంతోషాన్ని సంతృప్తిని నింపుతుంది. ఈ రోజు మీరు మీ స్నేహితులపై బాగా ఖర్చు పెడతారు. దానికి ప్రతిఫలాన్ని కూడా మీరు అందుకుంటారు.
ఈ రోజు చక్కని అదృష్టం, సానుకూల శక్తిని పొందుతారు. మీ పని మీ ఉన్నతాధికారులకు సంతృప్తి కలిగిస్తుంది. పనిలో కూడా ఏ సమస్యలు లేకుండా ఉంటాయి. సామాజిక గుర్తింపు, పదోన్నతి లభించే సూచనలున్నాయి.
ఈ రోజు కొంత అనారోగ్యంతో ఉంటారు. బలహీనంగా, బద్ధకంగా, చికాకుగా ఉంటారు. వ్యాపారంలో తలెత్తే తాత్కాలిక అవాంతరాలు మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. మీ మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తాయి. ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకోకుండా ముఖ్యంగా మీ సమకాలీకులు, పోటీదారులతో చూసుకోండి.
ఊహించని ఖర్చులు ఈ రోజు మిమ్మల్ని చుట్టుముడతాయి. దీనికి రెండు కారణాలు: ఆరోగ్యం లేదా సామాజిక కారణాలు. రోడ్డు పక్కన ఆహారం తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మీ ఆలోచనలకు అవాంతరం కలిగించే ప్రతికూల ఆలోచనలకు విరామం ఇవ్వండి.
ఈ రోజు అంతా ఆనందంగా ఉత్సాహంతో గడుపుతారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం కలిసికట్టుగా ఉండి అద్భుతాలు సృష్టిస్తారు. మీరు మీ పనులను సకాలంలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొత్త దుస్తులు, కుదిరితే కొత్త వాహనం కొనే సమయం ఇది.
తారాబలం ఈ రోజు మీకు చక్కని ఆరోగ్యాన్ని, సమతూకమైన మానసికస్థితిని అందిస్తాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం మిమ్మల్ని సంతోషంగా, సంతృప్తికరంగా ఉంచుతుంది. తీయగా మాట్లాడితే పనులు సాఫీగా పూర్తయ్యే చోటు దూకుడుగా వ్యవహరించకండి.