తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందో చూసుకున్నారా? - telugu panchangam

Horoscope Today : ఈ రోజు (మార్చి 21) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope Today
Horoscope Today

By

Published : Mar 21, 2023, 6:19 AM IST

Horoscope Today: ఈ రోజు (మార్చి 21) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

ఈ రోజు మీరు ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో గౌరవం, ఖ్యాతి పెరుగుతాయి. మీ వ్యాపారం బాగా రాణిస్తుంది. జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టేందుకు ఎదురుచూస్తున్న వారి ఎదురుచూపులు ఇక ముగిసినట్టే. త్వరలోనే కళ్యాణం జరిగే అవకాశం కనిపిస్తుంది.

వ్యాపారపరంగా అద్బుతమైన రోజు. మీ పనికి లభించే ప్రశంసలతో మీరు తడిసిముద్దవుతారు. ఇది మీకు పేరు, ప్రఖ్యాతలతో పాటు సమాజంలో గుర్తింపును తీసుకువస్తుంది. ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా ఉండబోతున్నాయి.

మీ తోటి ఉద్యోగులు, ఉన్నతాధికారులతో సంబంధాలు చెడగొట్టుకోవడం అంత మంచి ఆలోచన కాదు. రాజీపడేందుకు ప్రయత్నించండి. తద్వారా మీకే కాదు ఇతరులకు కూడా పనికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించగలుగుతారు. ఈ రోజు మీరు విలాసవంతమైన వాటిపై ఖర్చు చేస్తారు.

ఈ రోజు మీ అదృష్టతారలు నిలకడగా లేవు. కాబట్టి పనుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకు, మీ కుటుంబానికి చెడ్డపేరు తెచ్చే అక్రమ, అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండండి. పౌరుషంగా మాట్లాడకండి. అది ఇతరులకు బాధ కలిగిస్తుంది.

ఈ రోజు మీరు మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉంటారు. ఇది స్నేహితులు, బంధువులతో సరదాగా గడపాల్సిన సమయం. సన్నిహితులతో కలిసి బయటకు వెళ్లే ఆలోచన చేస్తారు. వ్యాపారంలో మీ భాగస్వాములతో మంచి డీల్​ను కుదుర్చుకుంటారు.

ఈ రోజు మీకు అద్భుతమైనది. మీ వ్యాపార భాగస్వాముల నుంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. అంతేగాక, మీ పనిని విజయవంతంగా పూర్తిచేయడం వల్ల ఉల్లాసభరితంగా ఉంటారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సాయంత్రం ఆనందంగా గడుపుతారు. మ్యూజిక్ వింటూ ఆనందించండి. ఇది సేదతీరడానికి ఒక మంచి మార్గం.

చర్చల్లో, వాదనల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా మీ విశ్లేషణ, సృజనాత్మక సామర్ధ్యాలను పరీక్షించడానికి ఇది మంచి రోజు. సృజనాత్మక రచనలు రాయడం గురించి ఆలోచిస్తున్నట్లయితే, ఆ పనిని ప్రారంభివచ్చు. ఈరోజు అలాంటి కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది. వీటి వల్ల మీ సామర్ధ్యాలకు పదును పెట్టడమే కాక, అది మీ పనిలో కూడా సహాయకరంగా ఉంటుంది.

మొండితనంతో ఉంటే.. తర్వాత చితించాల్సి వస్తుంది. మీ భావోద్వేగాన్ని కూడా తగ్గించుకోండి. లేదంటే అది మిమ్మల్ని మానసిక అశాంతికి గురిచేస్తుంది. మధ్యాహ్నం తర్వాత కొత్త పనులు లేదా ప్రాజెక్టులపై పనిచేయకుండా ఉంటే మంచిది. బదులుగా, ఏదైనా మనసుకు కాస్త ఓదార్పునిచ్చే పనిని చేపట్టండి.

ఈరోజు ఉదయం బాగానే ప్రారంభమైనా.. చివరకు కాస్త నిరాశతో ముగుస్తుంది. ఉదయం మనసు, శరీరంపై పూర్తి నియంత్రణను కలిగి ఉంటారు. అది మీ కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తున్న సమస్యలను వెలికితీసేలా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీరు ఆ సమస్యలను పరిష్కరించడంలో కూడా విజయం సాధిస్తారు.

అనవసరమైన పరిస్థితులు తలెత్తకుండా చూసేందుకు ఈ రోజు మీరు మౌనంగా ఉండటం శ్రేయస్కరం. మనస్సును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తారు.

ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఇంట్లో, ఆఫీసులో మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న మైలురాయిని అందుకుంటారు. మీ వృత్తిపరమైన స్థాయి, సమాజంలో హోదా పెరుగుతుంది.

ఈ రోజు మీరు అనుకున్న పనులను సాధించడానికి మీ శక్తులను సానుకూలమైన మార్గంలో వినియోగించండి. ధ్యానం, యోగా సాధన చేయడం ద్వారా ఇది సాధ్యపడేలా చేయవచ్చు. మీ కుటుంబ సభ్యులు, ప్రియమైనవారితో వాగ్వివాదాలకు అవకాశం ఉంది. అలాంటివి జరగకుండా ఉండేందుకు మీ మాటలను, ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి.

ABOUT THE AUTHOR

...view details