తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today : ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today : ఈ రోజు (మార్చి 20) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope Today
Horoscope Today

By

Published : Mar 20, 2023, 6:14 AM IST

Horoscope Today : ఈ రోజు (మార్చి 20) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

మీరు సోషల్ నెట్వర్కుల్లో నిమగ్నమై కొత్త పరిచయాలు పెంచుకుంటారు. అవి రాబోయే రోజుల్లో ఉపయోగకరంగా ఉంటాయి. ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది. మీరు వ్యాపారంలో విజయాన్ని సాధించే అవకాశం ఉంది. మీ పెద్దలు, ఉన్నతాధికారులు మీకు సహాయకరంగా ఉంటారు. ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటుంది.

ఈ రోజు మీకు చాలా గొప్పగా ఉంటుంది. విజయాన్ని సాధిస్తారు. వ్యాపారంలో ఉన్న వారికి నక్షత్రాలు అనుకూలంగా ఉన్నాయి. మీ వ్యాపారాన్ని విస్తరించవచ్చు. ఒకవేళ మీరు సేవల రంగంలో ఉన్నట్లయితే, ఉన్నతాధికారుల నుంచి సహాయం పొందుతారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంటుంది.

ఈ రోజు మీకు అంత అనుకూలంగా ఉండదు. శారీరకంగా, మానసికంగా కొంత ఇబ్బందిగా గడుపుతారు. మీ పనిని చేపట్టడానికి కావాల్సిన ఉత్సాహాన్ని కూడా కలిగి ఉండరు. మీ సహోద్యోగులు, ఉన్నతాధికారులు స్నేహపూర్వకంగా లేదా సహకారంగా ఉండరు. వ్యర్ధపూరిత ఖర్చులకు అవకాశం లేకపోలేదు.

ఈ రోజు ఎదురయ్యే ఆటంకాలు, సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొంటారు. ఏ పరిస్థితి నుంచైన విజయంతో తిరిగి రావడం లక్ష్యంగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యాల్లో ఈ రోజు మీరు తీవ్రమైన పోటీని ఎదుర్కొవాల్సి రావచ్చు. వ్యక్తిగత జీవితం ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతుంది.

మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య మనస్పర్థలు ఇద్దరికీ బాధను కలిగిస్తాయి. మీ జీవిత భాగస్వామి రుగ్మతతో బాధపడవచ్చు. మీ సహచరులు, వ్యాపార భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు ప్రశాంతంగా, ఓపికతో ఉండండి. అనవసరమైన, ప్రయోజనంలేని చర్చల్లో పాల్గొనకుండా ఉండటానికి ప్రయత్నించండి.

ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. మీ సామర్ధ్యం, కఠిన శ్రమ అందరి చేత ప్రశంసలను అందుకుంటుంది. బాగా ప్రభావితం చేసే ఓ మిత్రుడు మీకు అదృష్టంగా మారతారు.

మీ బాస్ కోపాన్ని చవి చూస్తారు. మీ తోటి ఉద్యోగులు కూడా ఇష్టం లేకుండా సహకారం అందిస్తారు. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న బిగినర్స్​కు ఇంటర్వ్యూల్లో విజయాలు ఆలస్యమవుతాయి.

మాటల్లో జ్ఞానం, చేతల్లో నాయకత్వం - ఈ రోజు మీ తీరు ఇలా ఉంటుంది. పని ప్రదేశంలో జీతం పెంపు లేదా ప్రమోషన్​కు సంబంధించిన శుభవార్త వింటారు. అకౌంటెంట్లు, ఫ్రాంచైజీలు ఈ రోజు చక్కని లాభాలు అందుకుంటారు.

పరిస్థితి అదుపు తప్పుతున్నప్పుడు మానసికంగా బలహీన పడతారు. కానీ మీరు సహనంగా ఉండాలని సూచిస్తున్నాం. అలా ఉండటం ద్వారా మీరు మీ గమ్యాన్ని చేరుకోగలరు. పని ప్రదేశంలో ఎవరితోనూ గొడవ పడకండి. ఆ ఘర్షణల ప్రభావం చాలా తీవ్రస్థాయిలో ఉంటుంది. వ్యక్తిగతంగా చూస్తే ఈ రోజు మీరు మీ భాగస్వామితో సన్నిహితంగా ఉంటారు.

కొన్నిసార్లు ఏదో తెలుసుకోవాలనే తపన మీలో ఉంటుంది. ఈ రోజు అలాంటిది. మీ ప్రత్యర్థుల ఆలోచనలను తలకిందులు చేస్తారు. మీరు సరైన ప్రత్యర్థి అని కూడా నిరూపించుకుంటారు. అది మీకు చాలా ప్రయోజనకరంగా మారుతుంది. మీలో మేధావి కూడా ఉన్నాడు. పరిస్థితులు అదుపు తప్పుతున్నప్పుడు మీ వ్యక్తిత్వ శక్తిని మీరు రుజువు చేసుకుంటారు.

మీ తారాబలం బ్రహ్మాండంగా ఉంది. మీ గ్రహాలు ఉచ్చదశలో ఉన్నాయి. ఈ మాట ఆర్థిక సంబంధమైన ఫలితాలు చెబుతున్నాయి. మీరు శారీరకంగా, మానసికంగానూ చాలా సంతోషంగా ఉంటారు. ట్రిప్​లకు ప్లాన్ చెయ్యండి. ఈ రోజు ఆధ్యాత్మికంగా గడపడం మీకెంతో హాయినిస్తుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగానే గడుస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీరు షాపింగ్​కు వెళ్తారు.

మీకు నచ్చిన రంగంలో ముందుకెళ్లి మంచి పేరు సంపాదించుకుంటారు. మీ మనసు మాట విని మీలోని నిజమైన రూపాన్ని చూపాలనుకుంటారు. మీరు ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దంలోనూ మీ మాటను వినగలిగే మీ తోటి స్నేహితులతో సాయంత్రం గడపండి.

ABOUT THE AUTHOR

...view details