తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే? - telugu panchangam

Horoscope Today: ఈ రోజు(మార్చి 13) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

horoscope today
నేటి రాశి ఫలాలు

By

Published : Mar 13, 2023, 6:13 AM IST

Horoscope Today: ఈ రోజు(మార్చి 13) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

మీరు ఈ రోజు ఆచితూచి మాట్లాడడం మేలు. మీ శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణం వల్ల అనుకోని కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా వేసుకునేందుకు ప్రయత్నించండి. ఈ రోజు మిశ్రమ ఫలితాలు చవిచూస్తారు. కొత్త పనులను మొదలుపెట్టకండి. కోపం, అసహ్యం లాంటి భావనలు లేకుండా జాగ్రత్త పడండి.

ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. మీరు శారీరకంగానూ బాగుంటారు. మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీ స్నేహితులతోనూ, ఫ్యామిలీతోనూ సరదాగా గడుపుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పొందుతారు. విదేశాల నుంచి శుభవార్త వింటారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

ఈ రోజు మీరు విజయవంతంగా చాలా పనులు పూర్తి చేస్తారు. మంచి పేరు ప్రఖాత్యలు సంపాదిస్తారు. మీకు ఇంటిలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. మీకు అదనపు సొమ్ము కూడా వస్తుంది. కానీ అనవసరమైన ఖర్చులు చాలా చేయవలసి ఉంటుంది. శారీరకంగానూ, మానసికంగానూ మీరు ఆరోగ్యంగానే ఉంటారు. పనిలో తోటివారి సహకారం. మీ పనికి మంచి గుర్తింపు లభిస్తుంది.

మీరు ఈ రోజు నీరసంగా ఉంటారు. అనారోగ్యం బారినపడతారు. అలాగే మానసిక అస్థిరతతో ఉంటారు. ఈ రోజు మీరు డల్​గా ఉంటారు. సహనాన్ని కోల్పోతారు. మీకు ఇష్టమైన వారితోనూ వాగ్వాదానికి దిగుతారు. కాస్త సర్దుకుని పోవడానికి ఈ రోజు ప్రయత్నించండి.

మీరు ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కోపంతో కాకుండా ఆచితూచి వ్యవహరించండి. మీరు అవసరానికి మించిన కోపం, నెగిటివిటీ చూపించడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడతారు. డాక్యుమెంట్ విషయాల్లోనూ జాగ్రత్తగా వహించండి.

ఈ రోజు భాగస్వామ్య ప్రాజెక్టులకు మీరు దూరంగా ఉండటం మంచిది. మీరు ఒంటరిగానే పోటీని ఎదుర్కొగలరు. మీ నమ్మకాన్ని దెబ్బతీసే పనులేవి చేపట్టకండి.

జనాలు చెప్పే మాటను ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఆచరణలో పెట్టేందుకు మీరు ఈ రోజు ప్రయత్నిస్తారు. మీ చుట్టుపక్కల ఉండే ప్రతీ విషయాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఇలాంటి విషయాలపై జాగ్రత్తగా ఉండడం మేలు.

ఈ రోజు మీరు శారీరకంగానూ, మానసికంగానూ చాలా హాయిగా ఉంటారు. మీ ఇంటి వాతావరణం చాలా శాంతియుతంగా ఉంటుంది. ఎవరి పనులు వాళ్లు చాలా బాగా పూర్తి చేస్తారు. మీరు పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది. వారితో ప్రశాంతంగా గడుపుతారు. మీరు హాలిడే ట్రిప్​కి వెళ్లే అవకాశం ఉంది.

మీరు మాట్లాడే తీరు, సమర్థతా లేకపోవడం వల్ల మీరు చాలా ఇబ్బంది పడతారు. అందరితో జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే మీరు రోజంతా వాదనలూ, సంజాయిషీలతోనే కాలం గడిపేస్తారు. మీ సమస్యలు ఊహించిన దానికన్నా చాలా కష్టమైనవి. మీకు ఇష్టమైన వారితో ఆనందంగా గడుపుతారు. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఈ రోజు మీకు చాలా బాగుంటుంది. మీ బంధువులూ, స్నేహితులను కలిసే అవకాశం ఉంది. ఈ రోజు సంబంధాలు చూడడానికి మంచి రోజు. స్నేహితుల నుంచి బహుమతులు అందుకుంటారు. వ్యాపారంలో రాణిస్తారు.

కొన్ని సందర్భాల్లో మనం బయటకు రాలేని పరిస్థితుల్లో చిక్కుకుపోతాం. అయితే ఒక స్వతంత్ర వ్యక్తిగా మీరు ఇతరుల సాయం అవసరం లేకుండానే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటారు. ఆ సామర్ద్యం ఈ రోజు మిమ్మల్ని మరింత స్థిరంగా ఉంచుతుంది.

మీ కంటే ఎక్కువ శక్తివంతమైన వారితో ఈ రోజు తలపడవద్దు. మీరు ఈ రోజు బద్దకంగా ఉంటారు. మీరు పోటీదారులతోనూ, మీ ప్రత్యర్థులతోనూ అనవసరమైన తగాదాలు పెట్టుకోవద్దు. పాజిటివ్ థింకింగ్​తో ముందుకు సాగండి.

ABOUT THE AUTHOR

...view details