Horoscope Today: ఈ రోజు(మార్చి 10) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
Horoscope Today
By
Published : Mar 10, 2023, 6:23 AM IST
Horoscope Today: ఈ రోజు(మార్చి 10) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
ఈ రోజు మీరు సంతోషంగా ఉండండి. మీరు వేసే అడుగు సరైన ఫలితాలను తెస్తుంది. మీరు మీ రంగంలో పని చేసే చాలా మంది వ్యక్తులను కలుసుకుంటారు. అందులో కొందరు బయటవారు కూడా ఉంటారు. మీరు కొంత మానసిక శ్రమ ఇచ్చే పనులనే ఇష్ట పడతారు. ఒక పర్యటన ఉంటుంది. ఈ రోజు కష్టపడి పని చెయ్యడానికి మంచి రోజు. మీ శారీరక, మానసిక ఆరోగ్యాలు బాగానే ఉంటాయి.
కమ్యూనికేషన్, పబ్లిక్ స్పీకింగ్ రంగాల్లో గానీ మీరు ఉండి ఉంటే, మీరు ఈరోజు మీ ఆడియన్స్‌ను మంత్ర ముగ్ధుల్ని చేస్తారు. ఒక్కొక్కరితో విడిగా మాట్లాడినప్పుడు కూడా మీరు ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఇలా చెయ్యడం వల్ల మీ పరిచయస్తుల్లో కొందరితో మీకు మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడ వచ్చు. మీరు స్టూడెంట్ అయితే, అన్ని విషయాలూ అతి సులువుగా అందుకుంటారు. మీకు ఎక్కడ లేని అసాధారణమైన తెలివితేటలు ఉంటాయి. మీ ఆరోగ్యం అంత బాగుండకపోవచ్చు. మీరు కష్టపడిన దానికి తగినట్టుగా ఫలితం రాకనూ పోవచ్చు. కానీ ఈ ఆటంకాలన్నీ నిద్ర లేస్తున్న సింహానికి చాలా అల్పం.
మీ భావోద్వేగాన్ని అదుపులో ఉంచుకోండి. వాటి అధీనంలోకి మీరు వెళ్లకండి. దీర్ఘ కాలంలో వ్యాధులు తెచ్చిపెట్టే మద్యపానం వంటి అలవాట్లను మానుకోవాలి. మిమ్మల్ని కొన్ని ఆలోచనలు బాధిస్తాయి. మీకు నిద్ర చాలక ఆరోగ్యానికి కూడా దెబ్బ వస్తుంది. కుటుంబ సభ్యులతో గొడవ పడకండి. ప్రయాణం చేయకండి.
ఈ రోజు, మీరు మీ సోదరుల నుంచి లబ్ధి పొందుతారు. మీరు స్నేహితులను కలుసుకోవడం వల్ల, మీకు ప్రియమైన వారి వల్ల లాభపడతారు. మీరు సుందరమైన ప్రదేశాలను చూసి రావడానికి వెళ్తారు. ఈ రోజు మీరు ప్రతి పనీ విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ పోటీ దారులు, మీ ప్రత్యర్థులు మీతో పోటీకి దిగలేరు. మీరు అదృష్టవంతులనే విషయం అనేక విధాలుగా నిరూపించబడుతుంది. సామాజికంగా పరపతి కలిగి ఉంటారు.
మీరు రోజు ఎలా గడపాలా అన్న దిగులు ఉంటుంది. మీ కుటుంబసభ్యుల ప్రోత్సాహం మీకు ఉంటుంది. మీరు సంతోషంగా ఉంటారు. దూరపు వ్యక్తితో లేదా సంస్థతో సంబంధం పెరుగుతుంది. భవిష్యత్తులో ఆ అనుబంధం వల్ల లాభపడవచ్చు. అనవసర ఖర్చులు తప్పించండి. మీ శ్రమకి తగ్గ ఫలితాలు లభించవు.
మెత్తగా, సున్నితంగా మాట్లాడుతూ మీరు అవతలి వారిని ఆకర్షిస్తారు. ఇది మీకు చాలా రకాలుగా లాభం. తెలివైన వారిగా ఒక ఇంప్రెషన్ వస్తుంది. అతి అరుదుగా వచ్చే ఒక ఆలోచన వల్ల మీరు విషయాన్ని చూసే దృష్టిలో మార్పు వస్తుంది. మీకు శారీరికంగా, మానసికంగా కూడా ఆరోగ్యం ఉంటుంది. మీకోసం ఒక శుభవార్త ఎదురు చూస్తోంది. మీదొక మంచి కుటుంబం.
మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీరు అనవసర చర్చల్లోకి దిగవద్దు. మీరు మీ కుటుంబ సభ్యులతో తగాదా పడవచ్చు. శారీరక అస్వస్థతకు లోనవుతారు. మీ పరువు ప్రతిష్ఠలు దెబ్బతింటాయి. గాయపడకుండా జాగ్రత్తలు తీసుకోండి. కోర్టు కేసులకు సంబంధించి జాగ్రత్త వహించండి. ఆధ్యాత్మిక సాధన మీకు కఠిన సమయాల్లో సహాయం చేస్తుంది.
ఈ రోజు మీకు లాభించే రోజు. కావలసిన సుఖసంతోషాలను అందుకోగలుగుతారు. వివాహం కావలనసివారికి ఇది శుభప్రదమైన రోజు. ఆర్థికపరంగా పారిశ్రామికవేత్తలందరూ చాలా లాభపడవచ్చు. మీరు మీపై అధికారులను మెప్పిస్తారు. మీరు మీ స్నేహితులను కలవవచ్చు. అందమైన ప్రదేశాల సందర్శనకు వెళ్లవచ్చు.
ఈ రోజు తారాబలం మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజు సహయం చేసే మనసుతో ఉంటారు. అందువల్ల జనంతో మెప్పు పొందుతారు. మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. పనిచేసే చోట మీ అధికారులను మెప్పిస్తారు. మీకు పదోన్నతి వచ్చే అదృష్టం ఉంది. వ్యాపార సంబంధమైన ప్రయాణం చేసే అవకాశం వుంది. పెద్దలు ప్రత్యేకంగా మీ నాన్న గారి నుంటి లాభదాయకమైన సూచనలు పొందగలరు.
ఈ రోజు మీ తారాబలం అనుకూలంగా ఉంది. ఏదేమైనా అంతర్గతంగా ఉండే ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి మంచి రోజు. మీకు కొత్త ఆలోచనలు వస్తాయి. కళాకారులు, రచయితలు ఈ రోజు మంచి నైపుణ్యం ప్రదర్శించగలరు.
ఈ రోజు చాలా ఇబ్బందులు, ఒత్తిడి ఉండే అవకాశం వుంది. కోపం, చిరాకు పెరుగుతాయి. దేవుణ్ణి స్మరించండి, మౌనంగా వుండడం, ధ్యానం చేయడం మంచిది. అందువల్ల మీరు ప్రశాంతంగా గడిపే అవకాశం వుంది. చట్టవిరుద్దమైన పనులు చేయవద్దు. మీ పద్దతి ద్వారా ఇతరులు బాధపడే అవకాశం వుంది. అందువల్ల వీలైనంతవరకు మంచి మాటలనే మాట్లాడండి. మీ ఇంట్లో ఒక శుభకార్యం జరగవచ్చు. అందువల్ల ఖర్చులు పెరగవచ్చు.
ఈ రోజు మీకు గ్రహగతులు అనుకూలం. కళారంగంలో వారికి అన్ని రకాల సహాయంగా ఉంటుంది. మీరు కొత్త పార్టనర్ షిప్‌తో వ్యాపారం మొదలుపెట్టవచ్చు. రోజంతా పని చేసి అలిసిపోయాక , మీరు సరదాగా కాలక్షేపం చెయ్యాలనుకుంటారు. మీకు ప్రియమైన వారితో కలిసి పార్టీకి లేదా ఔటింగ్‌కు వెళ్లి రావచ్చు. మీరు మీ ఫ్యామిలీతో మీ బంధాన్ని దృఢపరుచుకుంటారు.