తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసా? - march 1st horoscope in telugu

Horoscope Today: ఈ రోజు(మార్చి1) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

1st March Horoscope in telugu
తెలుగులో రాశి ఫలాాలు

By

Published : Mar 1, 2023, 6:27 AM IST

Horoscope Today: ఈ రోజు(మార్చి1) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

ఈ రోజు శుభకరంగా కనిపిస్తోంది. కానీ మానసికంగా చికాకుతో ఉండే కారణంగా మీరు పనులను, కార్యక్రమాలను చేపట్టలేకపోతారు. దృఢ నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ముఖ్యమైన నిర్ణయాలను పక్కనపెట్టడం మంచిది. వృత్తిపరంగా ఏదైనా ప్రయాణం చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

ఈ రోజు మీరు మౌనంగా, ప్రశాంతంగా ఉండటం మంచిది. గందరగోళం, నిర్ణయాల్లో అనిశ్చితి కారణంగా మంచి అవకాశాలను మీరు కోల్పోవచ్చు. రాజీపూర్వక ధోరణి, సర్దుకుపోయే తత్వం కలిగి ఉండేందుకు ప్రయత్నించండి. ప్రయాణాన్ని వాయిదా వేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

ఆర్థికపరంగా ఈ రోజు మీరు ప్రయోజనం పొందే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీరు మీ స్నేహితులు, బంధువులతో సరదాగా గడుపుతారు. మీకు నచ్చిన భోజనం తింటారు, నచ్చిన దుస్తులు ధరిస్తారు. ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. అనవసర ఖర్చులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

ఈ రోజు మీరు గజిబిజిగా, గందరగోళంగా ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. మీకు మీ కుటుంబసభ్యులు కొన్ని విషయాల్లో వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి. అధిక ఖర్చు కూడా ఉంటుంది. ఇంటికి సంబంధించిన వాటిపై ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. మాట నియంత్రణలో పెట్టుకోండి. అపార్థాలు తొలగించే ప్రయత్నం చేయండి.

ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. స్నేహితులు ముఖ్యంగా మీ బంధువులు మీతో మంచిగా ఉంటారు. అందమైన ప్రదేశానికి వెళ్లే సూచనలు ఉన్నాయి. కానీ మీరు జాప్యం చేస్తే ఆ అవకాశం మీ చేజారిపోతోంది.

దైవబలం ఈ రోజు మీపై చక్కగా ఉంటుంది. ఈ రోజు ప్రారంభించే పనులు, కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. వృత్తినిపుణులు, ఆఫీసుల్లో పనిచేసేవారికి ఇంక్రిమెంట్లు, పదోన్నతులు ఉంటాయి. వ్యాపారులు మంచి లాభాలు అందుకుంటారు.

ఈ రోజు వ్యాపారులకు మంచి లాభదాయకంగా ఉంది. వృత్తినిపుణులు, ఆఫీసుల్లో పనిచేసేవారికి సహచరులు, తోటి ఉద్యోగుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. తీర్థయాత్ర చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ రోజు మీరు సురక్షితంగా ఉండేందుకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పనులు మీరు అనుకున్నట్టుగా సాగవు కాబట్టి కొత్తగా ప్రారంభించే పనులను, కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం మంచిది. మీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.

ఈ రోజు చాలా సంతోషకరంగా ఉంటుంది. ఈ రోజంతా మీరు ఆహ్లాదంగా గడుపుతారు. విదేశీయుల సాంగత్యంలో మీరు సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి కొత్త ప్రదేశాలు చూస్తారు. సాహిత్యపరమైన కార్యకలాపాలకు ఈ రోజు అనుకూలంగా ఉంది. భాగస్వామ్యాలు లాభదాయకంగా ఉంటాయి.

ఈ రోజు మీకు అంతా అనుకూలంగా ఉండి పరిపూర్ణంగా అనిపిస్తుంది. వ్యాపారస్థులు, ఉద్యోగస్థులు, గృహిణులు, విద్యార్ధులకు ఈరోజు మంచి జరుగుతుంది. ఈరోజు మీ విరోధులు ఓటమిపాలవుతారు. ఆరోగ్యం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు.

మీరు సృజనాత్మకంగా, నిత్య నూతన విషయాలకు ప్రాణం పొయ్యడానికి సిద్ధంగా ఉంటారు. మానసికంగా చాలా ఉత్సాహంగా ఉంటారు. మేధోపరమైన చర్చలు ఉండవచ్చు. మీరు మీ ఆలోచనలను అక్షరబద్ధం చేసినా, మీ సృజనాత్మక బలాలను స్వేచ్ఛాయుతంగా సాగనిచ్చినా ఈ రోజు చాలా సార్థకత ఉంటుంది. మీరు కొంత డబ్బును సిద్ధంగా ఉంచుకోండి. ఖర్చులు ఉంటాయి.

మీలో ఉత్సాహం, తేజస్సు తగ్గవచ్చు. మీ కుటుంబ సభ్యులతో వివాదాలు, గొడవలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కావున మీరు గొడవలు, వాదనలు చేయకుండా ఉంటే మంచిది. శారీరకంగా, మానసికంగా మీరు బలహీనంగా, అలసటగా ఉంటారు.

ABOUT THE AUTHOR

...view details