Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందో చూసుకున్నారా? - మార్చి 4 రాశిఫలాలు
Horoscope Today: ఈ రోజు(మార్చి 4) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
నేటి రాశిఫలాలు
By
Published : Mar 4, 2023, 6:10 AM IST
Horoscope Today: ఈ రోజు(మార్చి 4) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
మీరు ఈ రోజు బాగా సున్నితంగా, ఎమోషనల్‌గా ఉంటారు, ఇతరులు ఏమైనా అంటే మనస్తాపానికి గురవుతారు. వారి ధోరణి మీ అహాన్ని దెబ్బతీస్తుంది. మీ తల్లి ఆరోగ్యం మీకు ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు, పండితులకు ఈ రోజు అంత అనుకూలంగా లేదు.
మీ సమస్యలు, ఆందోళనలు మీలో కొత్త శక్తిని నింపుతాయి. మీరు ఉత్సాహంగా ఉంటారు. అదే సమయంలో మీరు బాగా సున్నితంగా, ఎమోషనల్‌గా మారుతారు. సృజనాత్మక వెల్లివిరియడం వల్ల మీరు ఏదైనా ఆర్టికల్, వ్యాసం లేదా ఏదైనా కథ రాసేందుకు ఉపక్రమిస్తారు.
ఈ రోజు మంచిగా ఉంటుంది కాని అంత మంచిగా కాదు, ఆహ్లాదకరంగా ఉంటుంది కాని అంత ఆహ్లాదకరంగా కాదు. బలహీనత, నిరాశ మిమ్మల్ని ఆవరిస్తుంది. ఆ తర్వాత ఆనందం, ఉల్లాసం ఒకదాని తర్వాత ఒకటిగా వస్తాయి. అనుకున్న రీతిలోనే రోజు గడుస్తుంది. ఆర్థికపరమైన పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. కాని తర్వాత అవి సాఫీగా ముందుకు సాగుతాయి.
ఈ రోజు మీకు సంతోషం, అదృష్టం, ఆనందం, అధికారం అన్ని తీసుకువస్తుంది. ఈ రోజంతా మీరు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. కుటుంబసభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో గెట్ టుగెదర్‌లో పాల్గొని సంతోషంగా గడుపుతారు. బహుమతులు కూడా అందుకునే సూచనలున్నాయి.
ఈ రోజు మీరు చాలా సున్నితంగా, చికాకుగా ఉంటారు. ఆరోగ్యం కూడా ఆందోళనకు అసౌకర్యానికి గురిచేస్తుంది. ఒత్తిడి, ఉద్రిక్తత మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఇతరుల సమస్యలు పరిష్కరించేందుకు వాటిని ఈ రోజు భుజాన వేసుకోకండి. న్యాయపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి.
ఈ రోజు బాగా లాభదాయకంగా ఉంటుంది. మీ ఖ్యాతి, ప్రజాదరణ అన్ని వైపుల నుంచి బాగా పెరుగుతుంది. డబ్బు రాక కూడా పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. స్నేహితులు ఉదారంగా, దయగా ఉంటారు. స్నేహితులతో సమయం గడపడం మీకు కలిసొస్తుంది.
ఈ రోజు శుభకరంగా ఉంది.ఇంట్లోనూ, పనిప్రదేశంలోనూ ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ప్రమోషన్ వచ్చే సూచనలు అధికంగా ఉన్నాయి. ఇంట్లో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, సహోద్యోగుల నుంచి సహకారం అందుకుంటారు.
ఈ రోజంతా బద్ధకంగా ఉంటారు. పిల్లలు అమర్యాదకరంగా వ్యవహరిస్తారు. వారి ఆరోగ్యం కూడా మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది. విరోధులు, శత్రువులను ఎదుర్కొనేందుకు ఇది మంచి రోజు కాదు.
ఆరోగ్యంపై జాగ్రత్త ఉన్నా, లేకున్నా డాక్టరుతో అపాయింట్‌మెంట్ ఉంటే దాన్ని మిస్ చేయకండి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావు కాబట్టి మీపై ఒత్తిడి ఉంటుంది. ప్రస్తుతానికి కొత్త పనులు చేపట్టకండి. ఇవన్నీ చికాకుకు దారి తీస్తాయి.
మీరు అదృష్టవంతులు. లేస్తూనే కాఫీ సువాసనలతో లేవడం మీకు ఇష్టం! మీ ఆదాయం వృద్ధి చెందుతుంది. మీరు ఏం చేసినా ఆ పనిలో రాణిస్తారు. అందరికీ విశ్వాసపాత్రంగా ఉంటారు. మీరు బిజినెస్, సొసైటీలో గుర్తింపు సాధించగలరు. మీ సమయాన్ని క్రియేటివ్‌గా, గొప్ప సరదాగా గడపగలరు. మీరు కోల్పోయిన వైభవాన్ని తిరిగి సాధించగలరని ఫలితాలు చెబుతున్నాయి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అన్నీ కలిసి గొప్ప రోజు!
ఈ రోజు మీరు సంతోషంగా ఉంటారు. మీరు చేపడుతున్న పనులు పూర్తిచేస్తారు, అవి మీకు పేరు, గుర్తింపు తెచ్చిపెడతాయి. మీకు సహకరించిన తోటి ఉద్యోగులకు ధన్యవాదాలు తెలపడం మరువకండి. మీరు మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంట్లోనూ వాతావరణం ఆహ్లాదభరితంగా ఉంటుంది.
ఆలోచనల ప్రవాహంతో మీరు సంతోషంగా ఉంటారు. సాహిత్య వ్యక్తీకరణలు, భావోద్వేగ అంశాలను మీరు సరైన రీతిలో చూడగలుగుతారు. విద్యార్థులు, పండితులు తమ చదువుల్లో రాణిస్తారు. ప్రేమికులు మరింత దగ్గరవుతారు.