Horoscope Today January 9th 2024 : జనవరి 9 (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :ఈ రోజు మేష రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. లేకుంటే, ఏళ్ల తరబడి మీరు చేసిన కష్టం మొత్తం వృథా అవుతుంది. శాంతంగా, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. పూర్తి శ్రద్ధతో పనిచేయండి.
వృషభం (Taurus) :ఈ రోజు వృషభ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మానసిక, శారీర ఆరోగ్యాలు బాగుంటాయి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. విదేశాల నుంచి మంచి శుభవార్త వింటారు. వైవాహిక జీవితం బాగుంటుంది. అనుకోని విధంగా ధనసంపదలు లభిస్తాయి.
మిథునం (Gemini) :ఈ రోజు మిథున రాశివారు విజయవంతంగా తమ పనులను పూర్తి చేస్తారు. ధనలాభం కలుగుతుంది. అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది.
కర్కాటకం (Cancer) :ఈ రోజు కర్కాటక రాశివారు ప్రశాంతంగా ఉండాలి. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. మానసిక కలవరపాటుకు గురవుతారు. ఒత్తిడి మిమ్మల్ని వేధిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. కోపంతో వాదనల్లోకి దిగుతారు. అందుకే సమయమనం పాటించడానికి ప్రయత్నించాలి.
సింహం (Leo) :ఈ రోజు సింహ రాశివారు చాలా అప్రమత్తంగా ఉండాలి. అనవసర ఉద్రేకాలకు, ఆవేశాలకు లోనుకాకూడదు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. మాతృసంబంధమైన విషయాలు మిమ్మల్ని కలవర పెడతాయి. కీలకమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నీటికి దూరంగా ఉండడం మంచిది.
కన్య (Virgo) :ఈ రోజు కన్య రాశివారికి తీవ్రమైన పోటీ ఎదురవుతుంది. దాన్ని మీరు ఒంటరిగానే ఎదుర్కోంటారు. మీ పరిపాలనా దక్షతను ప్రదర్శిస్తారు. అయితే మీ నమ్మకాన్ని దెబ్బతీసే పనులు ఏమీ చేయకూడదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి.
తుల (Libra) :ఈ రోజు తుల రాశివారు అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరుల మాటను పెడచెవిన పెడతారు. చుట్టుపక్కల వారు మిమ్మల్ని వ్యతిరేకించవచ్చు. కనుక అప్రమత్తంగా ఉండాలి. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి.
వృశ్చికం (Scorpio) :ఈ రోజు వృశ్చిక రాశివారు చాలా ఆనందంగా గడుపుతారు. ప్రేమతో, అంతులేని ఉత్సాహంతో ఉంటారు. అయితే దేన్నీ అతిగా చేయకూడదు. దీనివల్ల నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది.
ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు. వీలైనంత వరకు వాదనలకు దూరంగా ఉండాలి. కొన్ని భయంకరమైన సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. ధైర్యంగా ఉండండి. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి.
మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి చాలా బాగుంటుంది. మీ బంధువుల్ని, స్నేహితులను కలుసుకుంటారు. మంచి విలువైన కానుకలు అందుకుంటారు. వ్యాపారం కోసం చేసే ప్రయాణాలు సఫలమవుతాయి. ఖర్చులు మాత్రం పెరిగే అవకాశం ఉంది.
కుంభం (Aquarius) :ఈ రోజు కుంభ రాశివారికి అద్భుతంగా ఉంటుంది. పనులు సులభంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులు మీకు అండగా ఉంటారు. వ్యాపారులు, వృత్తి నిపుణులు మంచి లాభాలు సంపాదిస్తారు. పొత్తులు, భాగస్వామ్యాలు మీకు మంచి ప్రయోజనం చేకూరుస్తాయి. మీరు పెద్ద స్థాయిలో విజయం సాధిస్తారు.
మీనం (Pisces) :ఈ రోజు మీన రాశివారు ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. పెండింగ్ పనులను, కొత్త ప్రాజెక్టులను వాయిదా వేసుకుంటారు. విశ్రాంతి కోసం ప్రయత్నిస్తారు. రోజంతా జాలీగా గడుపుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.