తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today : ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందో చూసుకున్నారా? - ఆదివారం రాశిఫలాలు

Horoscope Today : ఈ రోజు (జనవరి 8) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

horoscope today
horoscope today

By

Published : Jan 8, 2023, 6:17 AM IST

Horoscope Today : ఈ రోజు (జనవరి 8) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

మిశ్రమ కాలం. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. కీలక విషయాల్లో శ్రద్ధను పెంచాలి. సందర్భానుసారంగా ముందుకు సాగండి. బంధు,మిత్రుల సలహాలు మేలైన ఫలితాన్ని ఇస్తాయి. మొహమాటంతో అనవసర ఖర్చులు పెరుగుతాయి. శివాలయ సందర్శనం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. చిత్తసౌఖ్యం ఉంది. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. సాహసోపేతమైన విజయాలు ఉన్నాయి.శివారాధన శుభకరం.

ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. అలసట చెందకుండా చూసుకోవాలి. బుద్ధిబలంతో విజయం సాధిస్తారు. కుటుంబసభ్యుల సహకారం ఉంది. దైవబలం రక్షిస్తోంది. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రారంభించబోయే పనుల్లో మంచి ఫలితాలు రాబడతారు.ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ఇష్టదైవాన్ని స్మరించండి.

ప్రయత్నకార్యానుకూలత ఉంది.శారీరక శ్రమ పెరుగుతుంది. ప్రతిభతో విజయాలను అందుకుంటారు.విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది.

మీ మీ రంగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. అనుకూల ఫలితాలను సాధిస్తారు. ఒక ముఖ్యమైన సమస్యను చాకచక్యంగా పరిష్కరిస్తారు. గురువుల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి.

‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్న వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని విషయాలలో మీరు అనుకున్నదాని కన్నా ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. సూర్య ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో నుంచి బయటపడగలుగుతారు. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది.ఇంట్లో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి. మీ ప్రతిష్టకు మచ్చ తెచ్చేందుకు కొందరు ప్రయత్నిస్తారు జాగ్రత్త. దైవారాధన మానవద్దు.

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా దైవానుగ్రహంతో వాటిని సమర్ధంగా ఎదుర్కొంటారు. క్రమంగా అభివృద్ధి సాధిస్తారు. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

ధర్మసిద్ధి ఉంది. ఏకాగ్రతతో పనిచేయండి అనుకున్నది సాధిస్తారు. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరం.అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తిచేస్తారు.ఆటంకాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి.విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి,ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఇష్టదేవత శ్లోకాన్ని చదవాలి.

మనఃస్సౌఖ్యం ఉంది. మీ మీ రంగాల్లో మంచిపేరు సంపాదిస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా ఎదుగుతారు. దుర్గాస్తుతి చదివితే బాగుంటుంది.

ABOUT THE AUTHOR

...view details