Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందో చూసుకున్నారా? - రాశిఫలాలు జనవరి 2023
Horoscope Today : ఈ రోజు (జనవరి 7) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
horoscope today
By
Published : Jan 7, 2023, 6:16 AM IST
Horoscope Today : ఈ రోజు (జనవరి 7) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
అర్థలాభం ఉంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. కుటుంబ చిక్కులు ఇబ్బంది పెడతాయి. రుణ సమస్యలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. శ్రీసుబ్రహ్మణ్య స్వామి సందర్శనం మేలు చేస్తుంది.
ముఖ్యవిషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు అవసరం అవుతాయి.శత్రువుల జోలికి పోకుండా ఉండటం మంచిది.ఒక వార్త బాధ కలిగిస్తుంది.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.గణపతి సందర్శనం శుభప్రదం.
ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఎవరితోనూ విభేదించకండి. మాటవిలువను కాపాడుకోవాలి. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శ్రీరామ నామస్మరణ మేలు చేస్తుంది.
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని కలిగిస్తాయి.బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.ఆంజనేయస్వామిని ఆరాధించాలి.
శుభకాలం.అనుకున్న పనులను పూర్తిచేస్తారు.అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ధార్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి.విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.శని శ్లోకం చదివితే మంచిది.
ప్రారంభించబోయే పనుల్లో సంతృప్తికర ఫలితాలను సాధిస్తారు.మనఃసంతోషాన్ని పొందుతారు.శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు.విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.
ఒక వ్యవహారంలో కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది.ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి.అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. రాహుశ్లోకాన్ని చదువుకోవడం మంచిది.
మీలోని పోరాట పటిమ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది.అధికారులు మీ పట్ల మిశ్రమ వైఖరితో ఉంటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు.శ్రీవేంకటేశ్వర సందర్శనం శుభప్రదం.
ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని విషయాల్లో ఊహించిన దాని కన్నా ఎక్కువ ఫలితాలు ఉంటాయి.శ్రీరామ సందర్శనం ఉత్తమం.
ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు.చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు.అవసరానికి డబ్బు అందుతుంది. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
ఉత్సాహంగా పనిచేస్తారు.బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. శ్రీలక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు.విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటివారి సహకారంతో ఒక ముఖ్య వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. శ్రీరామ నామాన్ని జపించాలి.