Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందో చూసుకున్నారా? - రాశిఫలాలు తెలుగులో
Horoscope Today : ఈ రోజు (జనవరి 6) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
horoscope today
By
Published : Jan 6, 2023, 6:20 AM IST
Horoscope Today : ఈ రోజు (జనవరి 6) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
మంచిపనులు చేస్తారు.వృత్తి,ఉద్యోగాల్లో అనుకూలత కలదు.మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణయాలతో విజయం వరిస్తుంది.గోవిందనామాలు చదవడం శుభప్రదం.
ప్రారంభించిన కార్యక్రమాల్లో విఘ్నాలు ఎదురవుతాయి.మనోధైర్యంతో చేసే పనులు నెరవేరుతాయి.కొన్ని సంఘటనలు మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరుస్తాయి.అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి.లక్ష్మీఆరాధన చేయాలి. కనకధారాస్తవం చదవాలి.
ప్రయత్నకార్యసిద్ధి ఉంది.మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.ధర్మసిద్ధి ఉంది.స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు.నవగ్రహ శ్లోకం చదవాలి.
ప్రారంభించబోయే పనుల్లో గొప్పఫలితాలు సాధిస్తారు.మనఃసంతోషాన్ని పొందుతారు.శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.
శుభకాలం.మనోధైర్యంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు.ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి.అర్ధ,వస్త్ర లాభాలు ఉన్నాయి.ఇష్టదేవతా శ్లోకాలు చదివితే బాగుంటుంది.
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి.ఎవరితోనూ వాదోపవాదాలు చేయరాదు.ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.
మీ పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి.మనోబలం తగ్గకుండా చూసుకోవాలి.ఓర్పు చాలా అవసరం.అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. నవగ్రహధ్యాన శ్లోకం చదివితే మంచిది.
శుభకాలం.ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు.ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీలక్ష్మీఅష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.
మంచి ఫలితాలు ఉన్నాయి.ఉత్సాహంగా పనిచేయాలి.ఆరోగ్యం సహకరిస్తుంది.శాంతి చేకూరుతుంది.శ్రీరామ నామాన్ని స్మరించండి.
సంపూర్ణ అవగాహనతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. తోటివారి సూచనలు ఉపయోగపడతాయి.వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. దుర్గారాధన మంచి ఫలితాలను ఇస్తుంది.
పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు.అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది.తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.