Horoscope Today January 6th 2024 : జనవరి 6 (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :ఈ రోజు మేష రాశివారికి చాలా బాగుంటుంది. ఆర్థికంగా లాభపడతారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.
వృషభం (Taurus) :ఈ రోజు వృషభ రాశివారు శారీరకంగా, మానసికంగా బాగుంటారు. మీరు అనుకున్న పనులు అన్నీ సకాలంలో పూర్తవుతాయి. మీ కోరికలు ఉన్నీ తీరుతాయి. రోజంతా సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
మిథునం (Gemini) :ఈ రోజు మిథున రాశివారు కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది. జీవిత భాగస్వామికి, పిల్లలకు సంబంధించి ఆందోళన చెందుతారు. మానసిక సంఘర్షణకు లోనవుతారు. ఉదర సంబంధిత సమస్యలు రావచ్చు. ఖర్చులు పెరుగుతాయి. ఇతరులతో గొడవపడకండి.
కర్కాటకం (Cancer) :ఈ రోజు కర్కాటక రాశికి ఏమాత్రం బాగుండదు. మానసిక పరిస్థితి ఏ మాత్రం బాగుండదు. కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. సహనం వహించాలి. డబ్బులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.
సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. స్నేహితులు, శ్రేయోభిలాషుల ద్వారా లాభం పొందుతారు. వారితో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు సంపాదిస్తారు.
కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారికి శుభఫలితాలు లభిస్తాయి. మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యులు మీకు అన్ని విధాలుగా అండగా నిలుస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు రాణిస్తారు. ఆరోగ్యం చక్కగా ఉంటుంది.
తుల (Libra) :ఈ రోజు తుల రాశివారు తమలోని సృజనాత్మకతను ప్రపంచానికి తెలియజేస్తారు. అందరి మన్ననలను పొందుతారు. శారీరకంగా, మానసికంగా ద్రుఢంగా ఉంటారు. పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది.
వృశ్చికం (Scorpio) :ఈ రోజు వృశ్చిక రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆసుపత్రికి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. లేదంటే లేనిపోని సమస్యలు వస్తాయి. సన్నిహితుల్లో అపోహలు ఏర్పడవచ్చు. వినోదాల కోసం ఖర్చులు చేస్తారు.
ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. కుటుంబ జీవితాన్ని సంపూర్ణంగా ఆనందిస్తారు. స్నేహితులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళతారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి వ్యాపారంలో చాలా అవరోధాలు ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంది. ప్రమాదకరమైన వ్యవహారాలకు దూరంగా ఉండాలి. దైవారాధన చేయడం మంచిద.
కుంభం (Aquarius) :ఈ రోజు కుంభ రాశివారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్రియమైన వారితో కలిసి సంతోషంగా గడుపుతారు. వ్యాపార పనుల మీద వివిధ ప్రాంతాలు తిరుగుతారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు సంపాదిస్తారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ప్రమోషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కానీ వాహన ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త వహించాలి.
మీనం (Pisces) :ఈ రోజు మీన రాశివారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యమైన పనులు కూడా చేపట్టకూడదు. స్నేహితులను అతిగా నమ్మకూడదు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇష్ట దైవాన్ని ప్రార్థించడం మంచిది.